Bear HulChul: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఎలుగుబంటి కలకలం.. భయభ్రాంతులకు గురైన విద్యార్ధులు

Bear HulChul: కడప జిల్లా(Kadapa District) ఇడుపులపాయ(Idupulapaya)లోని ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ 2 వద్ద విద్యార్థులకు..

Bear HulChul: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఎలుగుబంటి కలకలం.. భయభ్రాంతులకు గురైన విద్యార్ధులు
Bear Hulchul

Updated on: Feb 13, 2022 | 6:56 PM

Bear HulChul: కడప జిల్లా(Kadapa District) ఇడుపులపాయ(Idupulapaya)లోని ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అకాడమిక్ బిల్డింగ్ సమీపంలోని బాయ్స్ హాస్టల్ 2 వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. ఈ ఎలుగుబంటి సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఐటీ ఆర్కే వ్యాలీలోని క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉంటారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతిన్నదని.. అందుకనే ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చిందని విద్యార్దులు చెబుతున్నారు. తమ క్యాంపస్ లోకి ఎలుగు బంటి వచ్చిందని సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు చెప్పారు. దీంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

 

 

Also Read:

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. త్వరలోనే అందుబాటులోకి.. ఎక్కడుందో తెలుసా..