Andhra News: కనికరం చూపిన కలెక్టర్.. ధన్యవాదాలు తెలిపిన గ్రామస్థులు!

ఆయనో జిల్లా కలెక్టర్‌.. రాష్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 పథకంలో ఆయనా భాగమయ్యారు. స్వయంగా తానే ముందుకు వచ్చి 10 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సామాజిక వెనబాటుకు గురయ్యే వర్గాలకు ఆసరాగా నిలబడతానన్నారు. ఆ కుటుంబాల పిల్లలను డాక్టర్‌, ఇంజనీర్‌ చేసేలా పోత్సహిస్తానని భరోసా ఇచ్చారు. ఇంతకు ఆయనెవరో తెలుసుకుందాం పదండి.

Andhra News: కనికరం చూపిన కలెక్టర్.. ధన్యవాదాలు తెలిపిన గ్రామస్థులు!
Bapatla

Edited By: Anand T

Updated on: Jul 26, 2025 | 3:33 PM

పి4 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. పేద కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా అభివ్రుద్ది చేసేందుకు పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకోవడమే పి4 పథకం. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించి ఆ కుటుంబాలను పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తద్వార రాష్ట్రంలో పేదరికం తగ్గించాలన్న ఉద్దేశంతో సిఎం చంద్రబాబు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా పలువురు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే బాపట్ల కలెక్టర్ వెంకట మురళి ఔదార్యం చాటుకున్నారు. కేవలం పారిశ్రామిక వేత్తలే కాదు మనస్సున్న ప్రతిఒక్కరూ ఈ పథకంలో భాగస్వాములు అవుతున్నారనడానికి బాపట్ల కలెక్టర్ వెంకట మురళి మార్గదర్శకంగా నిలిచారు.

బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో పి4 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆర్థికంగా అత్యంత్య దుర్భర పరిస్థితిలో ఉన్న యానాది సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాల గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. సామాజిక వెనుకబాటుతనానికి గురయ్యే ఈ సామాజిక వర్గానికి చెందిన స్థానికులు ఇంకా అనేక విషయాల్లో వెనుకబడే ఉన్నారు. చేపలు పట్టడం, ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను ఏరుకోవడం, హోటల్స్ లో పారిశుద్య కార్మికులుగా పనిచేయడం వీరంతా చేస్తుంటారు. వీరి సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న కలెక్టర్ వెంకట మురళి చలించిపోయారు.

ఆ కుటుంబాలను అభివృద్దిలోకి తీసుకురావాలంటే ఎవరో ఎందకని తానే ముందుకొచ్చారు కలెక్టర్ వెంకట మురళి. పది కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 65 వేల రూపాయలు ఇస్తానని సభాముఖంగా చెప్పారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్‌ల్లో వేసి వాటితో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. అదే విధంగా ఈ పది కుటుంబాల్లో ఒక్కరినైనా డాక్టర్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుకునేలా వారిలో అవగాహన కల్పించి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. కలెక్టర్ ప్రకటనతో సభకు వచ్చిన స్థానికులు హర్షద్వానాలు తెలిపారు.

వీడియో చూడండి..

జిల్లా కలెక్టరే నేరుగా ముందుడగు వేయడంతో మిగిలిన పారిశ్రామికవేత్తలు కూడా స్వచ్చందంగా ముందుకొచ్చారు. కేవలం డబ్బులివ్వడమే కాకుండా వారి స్థితిగతులు మార్చేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని కలెక్టర్ ప్రకటన చేయడంతో ఆకుటుంబాల్లోనూ సంతోషం వెల్లివెరిసింది. ఇప్పటి వరకూ తమను ఎవరూ పట్టించుకోలేదని చాలా ప్రభుత్వ పథకాలు కూడా తమకు అందటం లేదని తెలిపారు. ఈ విషయంపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టిన కలెక్టర్ వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. తీర ప్రాంతం అధికంగా ఉన్న బాపట్ల జిల్లాలో అనేక చోట్ల ఇటువంటి కుటుంబాలు కనిపిస్తాయి. వారందరిని దత్తత తీసుకొని అభివృద్ధి దిశగా ఆ కుటుంబాలు పయనించేలా చేస్తామని అటు పారిశ్రామిక వేత్తలు, ఇటు కలెక్టర్ ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.