Bank Officials Scam: తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేటలోని ఓ జాతీయ బ్యాంకులో (ఆంధ్రబ్యాంక్ యూనియ్ బ్యాంక్) కౌలు రైతుల పేరిట భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రైతులకు తెలియకుండా కొంతమంది లక్షల రూపాయల లోన్లు తీసుకున్నారు. రైతులకు సమాచారం అందించకుండా కౌలురైతుల కార్డులు జారీచేసిన రెవెన్యూ అధికారులు. ఆ భూములపై సహకార సంఘ బ్యాంకుల్లో రుణాలు ఉన్నా అదనంగా రుణాలు ఇచ్చేసిన బ్యాంకు అధికారి. విషయం తెలిసి షాక్ కు గురైన కొంతమంది భూ యజమానులు. నిలదీసేసరికి బ్యాంక్ అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. స్కామ్ పై పోలీసులను ఆశ్రయించేందుకు సిద్దమవుతున్న భూ యజమానులు.