Nandyal: ఊరు చివర గేదెలు మేపేందుకు వెళ్లారు.. అక్కడ కనిపించింది చూసి షాక్

|

May 22, 2024 | 2:03 PM

నంద్యాల జిల్లా డోన్ సమీపంలో చిరుత పులి పిల్ల సంచారంతో స్థానికులు.. హడలిపోతున్నారు. కొందరు జీవాలను మేపేందుకు కొండ ప్రాంతంవైపు వెళ్లగా.. అక్కడ ఓ చిరుత పులి పిల్ల కనిపించింది.. వెంటనే వాళ్లు మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Nandyal: ఊరు చివర గేదెలు మేపేందుకు వెళ్లారు.. అక్కడ కనిపించింది చూసి షాక్
Baby Cheetah
Follow us on

జీవాలను మేపేందుకు స్థానికులు ఊరు చివర కొండల వద్దకు వెళ్లారు. అయితే అక్కడ చిరుత పులి పిల్ల కనిపించడంతో కంగుతిన్నారు. నంద్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. డోన్ మండలం చనుగొండ్ల దగ్గర చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ బుజ్జి చిరుత పిల్లను వీడియోలు తీశారు. ప్రస్తుతం బుజ్జి చిరుత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే చనుగొండ్ల గ్రామానికి  పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో.. స్థానికులు కంగారుపడుతున్నారు. తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉందేమో అని.. దాడి చేస్తుందేమో అని భయపడుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు.. అటు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిరుత వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో కనిపించిందని.. అక్కడ రాళ్ల మధ్యలో ఉంటూ అటు వైపుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు స్థానికులు చెబతున్నారు. కొండ ప్రాంతానికి ఆనుకొని గ్రామంలో ఇళ్లు ఉండటంతో చనుగొండ్ల గ్రామ ప్రజలు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. స్థానికులు చిరుత పిల్ల సంచారంపై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గతంలో కూడా తమ ఊర్లకు సమీప ప్రాంతాల్లో చిరుతలు సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం