Andhra Pradesh: నేను బతికే ఉన్నా.. నా ఆధార్ కార్డు ఇప్పంచండి మహాప్రభో..!
అన్న చనిపోతే తమ్ముడి ఆధార్ తొలగించారు అధికారులు. అడిగితే ఢిల్లీనో.. హైదరాబాదో వెళ్ళాలంటూ ఉచిత సలహా ఇవ్వడంతో ఓ అభాగ్యుడు తన ఆవేదనను వెళ్ళబుచుకున్నాడు. ఏ పనికైనా ఆధార్ తప్పనిసరి కావడం అతనికి ఆధార్ కార్డు లేక ఏ పని కాకపోవడంతో అధికారుల చుట్టూ కాళ్లు అడిగేలాగా తిరుగుతున్నాడు. తొలగించడమే మా వంతు ఆధార్ కావాలంటే ఢిల్లీలో.. హైదరాబాదో వెళ్ళు అంటూ అధికారులు అతనికి సూచిస్తున్నారు.

అన్న చనిపోతే తమ్ముడి ఆధార్ తొలగించారు అధికారులు. అడిగితే ఢిల్లీనో.. హైదరాబాదో వెళ్ళాలంటూ ఉచిత సలహా ఇవ్వడంతో ఓ అభాగ్యుడు తన ఆవేదనను వెళ్ళబుచుకున్నాడు. ఏ పనికైనా ఆధార్ తప్పనిసరి కావడం అతనికి ఆధార్ కార్డు లేక ఏ పని కాకపోవడంతో అధికారుల చుట్టూ కాళ్లు అడిగేలాగా తిరుగుతున్నాడు. తొలగించడమే మా వంతు ఆధార్ కావాలంటే ఢిల్లీలో.. హైదరాబాదో వెళ్ళు అంటూ అధికారులు అతనికి సూచిస్తున్నారు. అసలు తప్పిదం వారు చేసి, బాధితుడిని కష్టాలపాలు చేస్తున్నారు.
కడప జిల్లా కమలాపురం మండలం చదివిరాళ్ల గ్రామానికి చెందిన మొటిమర చిన్న గంగన్న తన ఆధార్ కార్డు కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నాడు. తన అన్న చనిపోతే ఆయన ఆధార్ కార్డుకి బదులు తన ఆధార్ తొలగించారని తెలిపాడు. బ్రతికుండగానే చనిపోయానని ఆధార్ తీసివేయడంతో లబోదిబోమంటున్నాడు. ఏ పని కావాలన్నా చేసుకోలేకపోతున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆధార్ తొలగించిన అధికారుల దగ్గరకు వెళ్లి బ్రతికే ఉన్నాను మహాప్రభో.. ఆధార్ కార్డు ఇవ్వండి అని మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండాపోయింది.
ఆధార్ కార్డు తొలగించడం వరకే మా వంతు అని తొలగించిన ఆధార్ కార్డును మళ్ళీ రికార్డుల్లోకి ఎక్కించాలి అంటే హైదరాబాదు కానీ ఢిల్లీ కానీ వెళ్లాలి. వెళ్లి పని చేసుకోవాలని తాపీగా చెబుతున్నారంటూ ఇదే విషయంపై అధికారులను ప్రజాప్రతినిధులను అనేకసార్లు అడిగినా ఫలితం లేకుండాపోయిందని చిన్న గంగన్న తన ఆవేదనను వెళ్ళగక్కారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు అవగాహన లేక పనిచేయడంతో సామాన్యులు నానా అవస్థలు పడతున్నారు. తప్పు వారిదైన తిప్పలు మాత్రం జనానికే అన్నట్లు ఉంది. ఏది ఏమైనా అధికారుల తీరుపై మాత్రం స్థానికులు మండిపడుతున్నారు. ఆధార్ కార్డు తొలగించిన అధికారులే బాధ్యతగా ఆధార్ కార్డును అతనికి ఇస్తే బాగుంటుందంటున్నారు. హైదరాబాద్ లేక ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఏం కావాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోజువారి కూలి చేసుకునే ఇలాంటి వ్యక్తులు అక్కడి దాకా వెళ్లి ఆధార్ కార్డు కోసం తెలుసుకోవాల్సిన పని ఉండడం బాధను కలుగజేస్తుందని స్థానికులు అంటున్నారు. మొత్తం మీద చిన్న గంగన్న పరిస్థితి ఆ దేవుడికి తెలియాలి..!
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
