AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?

డిగ్రీ చదివిన ఉన్నత విద్యావంతుడైనా… జల్సాలకు అలవాటు పడి నేరాల బాటపట్టాడు. గుంటూరు జిల్లా వీరంకివారిపాలెం గ్రామానికి చెందిన కాటూరి వెంకటేశ్‌ ఏటీఎం మోసాలతో అరాచకానికి పాల్పడ్డాడు. అమాయకులు, ముఖ్యంగా వృద్ధులను టార్గెట్‌ చేస్తూ వారి కార్డులు మార్చి లక్షలు దోచుకుంటున్నాడు.

Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
ATM Fraudster
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 15, 2025 | 6:42 PM

Share

అతను డిగ్రీ వరకు చదివిన ఉన్నత విద్యావంతుడు. అయితేనేం జల్సాలకు అలవాటు పడి తప్పుడు మార్గాన్ని ఎంచుకొని కటకటాల పాలయ్యాడు. గుంటూరు జిల్లా వీరంకివారిపాలెం గ్రామానికి చెందిన కాటూరి వెంకటేశ్‌ అనే యువకుడు వ్యసనాల బారిన పడి మోసాలకు అలవాటు పడ్డాడు. మొదట క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగించిన వెంకటేష్ తరువాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నేరాల బాట పట్టాడు. అందుకోసం ఏటీఎంలకు లావాదేవీల నిమిత్తం వచ్చే వృద్ధులు, చదువురాని వారినే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. వారిని మాటల్లో పెట్టి సహాయం చేసే నెపంతో బురిడీ కొట్టిస్తుంటాడు. వారి ఏటీఎం కార్డులు మార్పిడి చేసి మోసాలకు పాల్పడుతుంటాడు.

అందులో భాగంగా ఇటీవల రాజాం పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ ఏటీఎంను తనకు అనుకూలంగా ఎంచుకున్నాడు. తాను ఈజీగా మోసం చేయడానికి అనువుగా ఉన్న అమాయకులు ఎవరైనా ఎటిఎంకు వస్తారేమో అని అక్కడే చాలాసేపు వెయిట్ చేశాడు. అతను ఊహించినట్లే వంగర మండలం మరువాడకి చెందిన పైడిరాజు అనే వృద్ధుడు వచ్చాడు. భలే చాన్స్‌లే అనుకొని పైడిరాజును తన మాటలతో మోసం చేసే పనిలో పడ్డాడు. అలా మాటల్లోనే పైడిరాజు ఏటీఎంలోకి ప్రవేశించి తన కుమారుడికి డబ్బు డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే డబ్బు డిపాజిట్ చేయడం పైడిరాజుకు కష్టంగా మారింది. వెంటనే వెంకటేష్ తన ప్రవృత్తి ప్రారంభించాడు. తాను క్యాష్‌ డిపాజిట్ చేయడంలో సహాయం చేస్తానని నమ్మించాడు. వెంకటేష్‌ను నమ్మిన పైడిరాజు తన కుమారుడికి లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని తన దగ్గర ఉన్న డబ్బు అతనికి ఇచ్చాడు. అలా తీసుకున్న డబ్బులు ఎటిఎం ద్వారా రెండుసార్లుగా తన ఖాతాలో వేసుకొని మీ కుమారుడు ఖాతాలో డబ్బు వేశానని నమ్మించాడు. వృద్ధుడు పైడిరాజు నిజమేనని నమ్మి అక్కడ నుండి వెళ్లిపోయాడు. అలా ఇంటికి వెళ్ళిన పైడిరాజు తన కుమారుడికి ఫోన్ చేసి డబ్బులు వేశాను చెక్ చేసుకోమని చెప్పాడు. తండ్రి చెప్పగానే తన ఖాతా చేసుకున్న కొడుకు తన ఖాతాలోకి డబ్బులు రాలేదని, ఎవరో మిమ్మల్ని మోసం చేశారని తండ్రికి చెప్పాడు. దీంతో లబోదిబోమంటూ రాజాం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు పైడిరాజు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వెంకటేష్‌ను గాలించడం ప్రారంభించారు. అప్పటికే నిందితుడు వెంకటేష్ మోసపూరితంగా పొందిన డబ్బులో కొంత భాగం కుటుంబసభ్యులకు ఫోన్‌పే ద్వారా పంపి, మిగిలిన సొమ్ముతో రాజాంలో జల్సా చేస్తూ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ క్రమంలోనే పోలీసులు వెంకటేష్‌ను ట్రేస్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా నిందితుడిపై గతంలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, విజయవాడ తదితర ప్రాంతాల్లో 32 వరకు ఏటీఎం మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంల వద్ద ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సహాయం చేస్తానంటే నమ్మి మోసపోవద్దని అంటున్నారు పోలీసులు.

ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు