Prakasam: వీడు అసలు మనిషేనా… ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై అత్యాచారం

|

Dec 30, 2023 | 4:36 PM

ఏపీలో దారుణం జరిగింది. ఒంటరి వృద్ధురాలిపై మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆగంతకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో మండలంలో శనివారం చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలు విషమ పరిస్థితిలో ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Prakasam: వీడు అసలు మనిషేనా... ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై అత్యాచారం
Rape (Representative image)
Follow us on

ఏమై పోతోంది .. ఎటు పోతోంది ఈ సమాజం.. గజానికో గాంధరీ కొడుకు….. ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ బరితెగిస్తునే ఉన్నారు. అఘాయిత్యాలపర్వంలో మరో మాతృహృదయ నిర్వేదం. తాజాగా వృద్ధురాలిపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధ మహిళ ఇంట్లోకి కమలనాథ్ అనే యువకుడు మద్యం మైకంలో చొరపడ్డాడు. వెంటనే వృద్ధురాలు కేకలు వేయడంతో.. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

విషయాన్ని కుటుంబ సభ్యులకు వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..