ఎమ్మిగనూరు, జనవరి 31: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధిపై వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ వివరిస్తుండగా, టీడీపీ నాయకులు ఏమి అభివృద్ధి జరగలేదు అనడం పై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతుండగా మున్సిపల్ చైర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశంను ముగించి వెళ్ళిపోయారు.
ఎన్నో సమస్యలపై టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడాలని కౌన్సిల్ హల్కు వస్తే ఇలా మాట్లాడకుండా వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకోవడం దారుణమానన్నారు. సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల గొంతు నొక్కడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం మెట్లపై టీడీపీ నాయకులు బైటయించి నిరసన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశాల్లో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడే అవకాశం కలిపించాలని వారు డిమాండ్ చేసారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..