AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

May 04, 2023 | 7:24 PM

ఏపీలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. అకాల వర్షాలతో ఇప్పటికే పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ వర్ష సూచన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లేటెస్ట్ వెదర్ అప్ డేట్స్ మీ కోసం...

AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
Andhra Weather Report
Follow us on

ఉత్తర తమిళనాడు మరియు పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు కోస్తా తమిళనాడు మరియు పరిసరాల మీద సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో దాదాపుగా 06వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో మే 07 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 08న వాయుగుండం మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, అది తుఫానుగా బలపడి ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉంది.దాని మార్గం మరియు తీవ్రత అల్పపీడనము ఏర్పడిన తర్వాత తెలుపబడుతుంది. ఇది నిరంతరం మరియు క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతోంది. నైరుతి మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరాఠ్వాడా మరియు అంతర్గత కర్ణాటక మీదుగా ఉన్న ద్రోణి/గాలుల కోత సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో బలహీనంగా గుర్తించబడింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో బలహీనంగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయి.

 

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

గురువారం :-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

రాయలసీమ :-

గురువారం, శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

శనివారం :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..