AP Rains: ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..!

Andhra Pradesh Weather Forecast: తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో జూన్ 20 (శనివారం) ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు.

AP Rains: ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..!
Ap Weather Alert 20 June 2026
Image Credit source: Pexels

Updated on: Jun 19, 2026 | 5:38 PM

తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రేపు (శనివారం) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరోవైపు కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం (20-06-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి అత్యధికంగా అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో 61మిమీ వర్షపాతం నమోదయ్యింది.  శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 36మిమీ, వైఎస్సార్ కడప జిల్లా చౌడూరులో 31మిమీ, శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టిలో 29.9మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 28.2మిమీ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి 26.5మిమీ, కోటబొమ్మాళిలో 26.2మిమీ, లావేరులో 22.5మిమీ, కర్నూలు జిల్లా తోవిలో 22మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

Follow Us