
హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రాణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రుడా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ కొన్నిసూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని.. కొన్ని గ్రామాలను ఈ జాబితా నుంచి తప్పించి రింగ్ రోడ్డు విస్తీర్ణం తప్పించాలని సూచించారట.
అయితే మొదటి ప్లాన్ ప్రకారం ఈ ఔటర్ రింగ్ రోడ్డు రాజమండ్రిలోని మధురపూడి, ఎయిర్ పోర్టు రోడ్డును కలుపుతూ.. ‘రాజానగరం, దివాన్‌చెరువు, శ్రీరాంపురం, సంపత్‌నగర్, పుణ్యక్షేత్రం, నామవరం మీదుగా కడియం’ వరకు వెళ్లాల్సి ఉంది. ఈ మెత్తం దూరంగా 35 కిలోమీటర్లు కానుంది. కానీ తాజా నిర్ణయం, ప్రతిపాదన ప్రకారం ఈ మొత్తం 24 కిలోమీటర్లకు తగ్గనుందట. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో 1500 ఎకరాల భూమి అవసరం అవుతుండగా..ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం కేవలం 6 నుంచి 8 వందల ఎకరాలు భూమిని సేకరిస్తే పరిపోతుంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా ఆమోదం లభించలేదు.
అయితే ప్రతస్తుం చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16 రాజానగరం, దివాన్‌చెరువు, లాలాచెరువు మీదుగా వెళుతోంది. అంతేకాదు రాజమండ్రిని ఆనుకొని గుండుగొలును హైవే కూడా ఉంది. ఈ కారణంగా నగరంలో ట్రాఫిక్ సమ్యలు పెరిగిపోతున్నాయి. ఒక వేళ రాజమండ్రి నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఈ ట్రాఫిక్ సమస్యలు అన్ని తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.