
రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ద్విచక్రవాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పిసరిగ్గా పెట్టుకోవాలనే రూల్ను కఠినతరం చేస్తున్నారు. కేవలం రైడర్ మాత్రమే కాదు.. బ్యాక్ సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా కచ్చితంగా పెట్టుకోవాలని పోలీసులు అంటున్నారు. ఇప్పటి వరకు కేవలం విశాఖ పట్నంలోనే కఠినంగా అమలు చేస్తున్న ఈ రూల్స్ను ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు.
80 శాతం హెల్మెట్ లేని వారే!
కేంద్ర రోడ్డు భద్రతా కమిటీ నివేదికల ప్రకారం. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వాహనదారుల్లో సుమారు 80శాతంపైగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారే ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ సర్వోన్నతర న్యాయస్థానం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హెల్మెట్ ధరించడం తప్పని సరిచేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ను అమలు చేస్తున్నారు.
వాహనదారులకు షాక్ ఇస్తున్న రూల్స్
అయితే ఈ రూల్స్ అతిక్రమించి హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి పోలీసులు భారీ షాక్ ఇస్తున్నారు.హెల్మెట్ లేకుండా ఫస్ట్టైం పట్టుబడితే వాహన చట్టం ప్రకారం రూ.1,035 ఫైన్ వేస్తారు. లేదా తాత్కిలికంగా 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక రెండోసారి కూడా పట్టుబడితే ఆరు నెలల పాటు మీ లైసెన్స్ అనేది రద్దు చేయబడుతుంది. ఇక మూడోసారి పట్టుబడితే ఇక మీరు జీవితంలో బైక్ నడిపే వీలు లేకుండా మీ లైసెన్స్ను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ వాహనం కూడా సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పోలీసులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.