Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్లాట్లు కేటాయింపు.. అంతా లైన్ క్లియర్..

ఏపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణంపై స్పీడ్ పెంచింది. పట్టణాల్లోని పేదల కోసం భవన సముదాయాలను నిర్మించనుంది. పట్టణాలకు దూరంగా కాకుండా పేదలకు నివసించే ప్రాంతాల్లోనే వీటిని నిర్మించనున్నారు. ఒక్కొ ఫ్లాటుక రూ.17 లక్షల వరకు ఖర్చు అవుతుందన ప్రాథమికంగా అంచనా వేశారు.

Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్లాట్లు కేటాయింపు.. అంతా లైన్ క్లియర్..
Houses

Updated on: Sep 18, 2026 | 1:28 PM

పట్టణాల్లో నివసించే పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పట్టణాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు రెడీ అవుతోంది. టిడ్కో టవర్లను జీ+8, జీ+10, జీ+12, జీ+14 విధానంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కొ ఫ్లాట్ 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణాలలో పేదలు ఉండే ప్రాంతాల్లోనే వీటిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. పట్టణాలకు దూరంగా నిర్మించడం వల్ల పేదలు అక్కడికి వెళ్లి స్థిరపడాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా పట్టణాల్లోని భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తిస్తారు. స్థలం బట్టి ఎన్ని అంతస్తులుగా నిర్మించాలనేది అధికారులు నిర్ణయిస్తారు. ఒక్కొ ఫ్లాట్ ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉండనుంది.

ఇప్పటికే రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను కొన్నిచోట్ల నిర్మించగా.. వీటిని 300,365,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కానీ ఇప్పుడు ఒక్కొ ఫ్లాట్‌ను 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక స్థలంతో పాటు లబ్దిదారుల సంఖ్యను బట్టి ఎన్ని అంతస్తుల సముదాయం నిర్మించాలనేది నిర్ణయిస్తారు. ఇక ఈ అంతస్తులో లిఫ్ట్ సౌకర్యంతో పాటు పార్కింగ్ సౌకర్యం, షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు, కమర్షియల్ కాంప్లెక్స్ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. వాటికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఉండేలా డిజైన్ రూపొందించారు. ఈ డిజైన్‌ను ప్రభుత్వం కూడా ఆమోదించడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ముందడుగు పడింది.

2017లో జీ+3గా పద్దతిలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. అప్పుడు ఒక్కొ ఫ్లాట్‌కు రూ.8.50 లక్షల ఖర్చు అయింది. కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.90 వేలు తన వాటాగా అందించగా.. మిగతా సొమ్ము లబ్దిదారులు భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. దీంతో విస్తీర్ణం, టవర్,ఫ్లోర్‌ను బట్టి ఎంత ఖర్చు అవుతుందనేది అధికారులు అంచనా వేస్తారు. అంతస్తులు పెరిగే కొద్ది వ్యయం తగ్గుతుంది. జీ+8 పద్దతిలో నిర్మిస్తే ఒక్కొ ఫ్లాటుకు రూ.17.51 లక్షలు, జీ+10 విధానంలో రూ.16.52 లక్షలు, జీ+12 విధానంలో ఒక్కొ ఫ్లాటుకు రూ.16.14 లక్షలు, జీ+14విధానంలో రూ.15.70 లక్షల వ్యయం కానుంది. కేంద్రం, రాష్ట్రం తన వాటాగా రూ.3 లక్షలు అందిస్తాయి. మిగతా నిధులను లబ్దిదారులను భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 24 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే సర్వే నిర్వహిస్తోంది. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా వీటిని నిర్మించేందుకు సిద్దమవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us