Andhra Pradesh: ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.. తాడేపల్లిగూడెం నిట్‌లో స్టూడెంట్స్ ఆందోళన

|

Oct 28, 2022 | 8:34 PM

ఫ్యాకల్టీ వేధిస్తున్నారు. సస్పెండ్ చేయండి. ఇప్పటికి చాలా సార్లు కంప్లయింట్ చేశారా స్టూడెంట్స్. కానీ HOD నుంచి నో రియాక్షన్. దీంతో నిరసనకు దిగారు. ఇంతకీ ఎక్కడ జరిగిందీ ఘటన. ఆ డీటైల్స్ ఏంటి?

Andhra Pradesh: ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.. తాడేపల్లిగూడెం నిట్‌లో స్టూడెంట్స్ ఆందోళన
Tadepalligudem NIT Students Protest
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నిట్ లో విద్యార్దులు ఆందోళనకు దిగారు. బయోటెక్నాలజీ విభాగం ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారిక్కడి స్టూడెంట్స్. దీంతో నిట్ అడ్మిన్ ఆఫీసు ముందు బైఠాయించారు విద్యార్ధులు. ఇతడిపై ఎన్నిసార్లు కంప్లయింట్లు చేసినా HOD పట్టించుకోవడం లేదనీ.. అందుకే తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగినట్టు చెప్పారు. అతడితో బహిరంగ క్షమాపణ చెప్పించి.. విదుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

విద్యార్ధుల ఆందోళనలో నిట్ యాజమాన్యం అయోమయంలో పడింది. కాంపౌండ్ లోకి ఎవ్వరూ ప్రవేశించకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చెలరేగింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఇక్కడ జరిగింది ఒకటైతే.. అక్కడ పోలీసులకు నిట్ నిర్వాహకులు చెప్పింది మరొకటి. ఫుడ్ ప్రాబ్లం ఉందని ధర్నా చేశారనీ.. ఇందులో మరెలాంటి మేటర్ లేదని పోలీసులతో నిర్వాహకులు చెప్పడంతో.. ఈ వివాదం ఇక్కడితో సమసిపోయిందని తేల్చేశారు.

మరి ఇది ఇక్కడితో సమసి పోతుందా? లేక మరో బాసరలా భగ్గుమంటుందా? ఫ్యాకల్టీని కాపాడుతున్న వారెవరు? హెచ్ఓడీ- అతడిపై కఠిన చర్యలకు దిగటం లేదు ఎందుకని. సమస్య ఒకటైతే పోలీసులకు మరొకలా ఎందుకు చెబుతున్నట్టు? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది ఇక్కడి విద్యార్ధి లోకం.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం