
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందుతుందా లేదా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. ఏదైనా తేడా ఉంటే సంబంధిత వార్డెన్స్, అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఇన్‌స్పెక్షన్ వీడియోలు రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పనితీరును చాలామంది ప్రశంసిస్తున్నారు.
వాస్తవానికి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. బడుగుబలహీన వర్గాలతోపాటు, మధ్యతరగతి కుటుంబాలకు పోషకాహారం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. కానీ పర్యవేక్షణ లోపంతో చాలాచోట్ల పిల్లలకు సరైన ఫుడ్ అందడం లేదు. దీంతో విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యనటతో చాలామంది భయపడి.. పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారు. తాజాగా ఈయన ఒకటి వైరల్ అవుతోంది. దాదాపు మినిస్టర్ రేంజ్‌లో ఆయన కాన్వాయ్ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన కారు ముందు పొలీస్ జీప్‌తో పాటు వెనక దాదాపు 10 కార్లు ఫాలో అవుతున్నాయి. రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన సీహెచ్.విజయ్ ప్రతాప్ రెడ్డి 2022లో చార్జ్ తీసుకున్నారు. ఆయన పదవీకాలం ఇంకో ఏడాదిన్నర ఉంది. హాస్టల్స్, అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం పంపుతున్న వాటాను పర్యవేక్షించే అధికారం ఆయనకు ఉంటుంది.