రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ, తాజా నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్‌ను క్లోజ్‌ చేసిన ఏపీ హైకోర్టు

|

Mar 02, 2021 | 12:43 PM

Ration door delivery vehicles : రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం. వాహనాల రంగులు మార్చాలన్న తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. గత ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లింది జగన్..

రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ,  తాజా నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్‌ను క్లోజ్‌ చేసిన ఏపీ హైకోర్టు
Follow us on

Ration door delivery vehicles : ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.  సదరు వాహనాల రంగులు మార్చాలన్న తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది.  ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన  ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లింది జగన్ ప్రభుత్వం. దీంతో ఆ అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం, గ్రామీణ ప్రాంతాల్లో సరుకుల సరఫరాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు నిమ్మగడ్డ ‌.  తాజాగా SEC నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్‌ను క్లోజ్‌ చేసింది హైకోర్టు.  కాగా, ఫిబ్రవరి 5న ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో రంగులు మార్చకపోతే రేషన్ వాహనాలను తిప్పొద్దని ఎస్ఈసీ పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలకు వేసిన అధికార పార్టీకి చెందిన వైసీపీ రంగులు మార్చాలని ఎస్ఈసీ కోరిన సంగతి తెలిసిందే.

Read also : Nallamalla Reserve Forest Fire : నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్న మంటలు