AP IIIT Admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జూన్ 4న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు (జూన్ 4) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ..
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జూన్ 4న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు (జూన్ 4) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారని ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి వెల్లడించారు. జూన్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఏపీ ఆర్జీయూకేటీ- 2023 అడ్మిషన్ షెడ్యూల్ ఇదే..
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీ: జూన్ 4, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 26, 2023.
ప్రత్యేక కేటగిరీ అభ్యర్ధుల దరఖాస్తు స్వీకరణ తేదీలు..