AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

AP Rains: ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పొరుగు ప్రాంతాల మీద బలహీనపడి కొనసాగుతోంది..

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
AP Weather Report

Updated on: Nov 23, 2022 | 1:31 PM

నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని పశ్చిమ మధ్య ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదు ఉన్న అల్పపీడనం.. ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పొరుగు ప్రాంతాల మీద బలహీనపడి కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం మీద 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి.. నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. ఈ ద్రోణీ ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలో రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు.. అలాగే దక్షిణాంధ్రలో మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనలు:

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-

————————————————————————–
ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
————————————————————————–

ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది

రాయలసీమ:-
————————————————————————–

ఈరోజు:-

  • తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
  • భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
  • మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..