AP Rains: ఏపీకి వాయుగుండం ముప్పు.. రాబోయే మూడు రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వివరాలివే..

|

Dec 02, 2022 | 7:06 PM

ఈ నెల 4వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains: ఏపీకి వాయుగుండం ముప్పు.. రాబోయే మూడు రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వివరాలివే..
Ap Rains
Follow us on

ఈ నెల 4వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా డిసెంబర్ 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 48 గంటల్లో వాయుగుండంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 8 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడన ద్రోణీ ప్రభావం కారణంగా ఏపీలో రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్:-

  • ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

  • ఈ రోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
  • రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉంది.
  • ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:-

  • ఈ రోజు, రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
  • ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..