ఇకపై బోర్డర్‌లో నో మోర్ గేమ్స్.. ఏవోబీని షెల్టర్‌జోన్‌గా మార్చుకునే యత్నం!

ఆంధ్రా-ఒడిశా బోర్డర్.. షార్ట్‌కట్‌లో AOB. ఈ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కదలికలు..గత చరిత్ర అని ఇంతవరకూ భావించారు ఏపీ పోలీసులు. అయితే వరుసగా రెండు రోజులు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లు.. పోలీసుల ఆలోచనను మార్చేశాయి. దీంతో ఏవోబీలో ఇకపై నో మోర్ గేమ్స్ అంటూ వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో అలెర్ట్ అయిన ఏపీ పోలీసులు.. మావోయిస్ట్‌లకు బోర్డర్‌లోనే నోఎంట్రీ బోర్డు పెడుతున్నారు.

ఇకపై బోర్డర్‌లో నో మోర్ గేమ్స్.. ఏవోబీని షెల్టర్‌జోన్‌గా మార్చుకునే యత్నం!
Ap Police

Updated on: Nov 20, 2025 | 7:00 AM

ఆంధ్రా-ఒడిశా బోర్డర్.. షార్ట్‌కట్‌లో AOB. ఈ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కదలికలు..గత చరిత్ర అని ఇంతవరకూ భావించారు ఏపీ పోలీసులు. అయితే వరుసగా రెండు రోజులు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లు.. పోలీసుల ఆలోచనను మార్చేశాయి. దీంతో ఏవోబీలో ఇకపై నో మోర్ గేమ్స్ అంటూ వేట మొదలుపెట్టారు.

వరుస ఎన్‌కౌంటర్లు.. మావోయిస్ట్ అగ్రనేతల కదలికలతో AOBలో మళ్లీ హైటెన్షన్ మొదలయింది. మంగళవారం (నవంబర్ 18) ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా సహా ఆరుగురు మవోయిస్ట్‌లు హతం కాగా.. మరునాడు బుధవారం ఉదయం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో టెక్‌ శంకర్‌తో పాటు మరో ఆరుగురు మావోయిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఏపీలోని వివిధ జిల్లాల్లో తలదాచుకున్న మరో 50 మంది మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఏపీలో మళ్లీ హైటెన్షన్ మొదలయింది. ఏవోబీని షెల్టర్‌జోన్‌గా మార్చుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని..అందుకోసం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిని రిక్రూట్‌మెంట్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఏపీలోకి తరలిరావడంతో పోలీసుల నిఘా ఒక్కసారిగా పెరిగింది. ఏవోబీతోపాటు తూర్పు గోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనూ మావోయిస్టులు ఉన్నారేమోనన్న అనుమానంతో హైఅలర్ట్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీవైపు మావోయిస్ట్‌లు చొరబడకుండా పటిష్ట నిఘా వేసినట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు.

2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాలతో 2024 జనవరి నుంచి దండకారణ్యంలో ‘ఆపరేషన్ కగార్’ మొదలైంది. ఈ క్రమంలో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. 2014లో 126 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా.. 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది. ఆ తర్వాత ఏడాదిన్నర వ్యవధిలోనే చత్తీ‌‌‌‌స్‌‌‌‌గఢ్‌‌‌‌లోని బీజాపూర్‌‌‌‌, కాంకేర్‌‌‌‌, నారాయణపూర్‌‌‌‌, సుక్మా, జార్ఖండ్‌‌‌‌లోని వెస్ట్‌‌‌‌సింగ్‌‌‌‌ భూమ్‌‌‌‌, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు మాత్రమే మావోయిస్టు పార్టీ పరిమితమైంది. దీంతో ఎన్‌‌‌‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు.. సేఫ్‌జోన్‌ కోసం పట్టణాలు, నగరాల బాట పట్టారు. ఈ క్రమంలో అలెర్ట్ అయిన ఏపీ పోలీసులు.. మావోయిస్ట్‌లకు బోర్డర్‌లోనే నోఎంట్రీ బోర్డు పెడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..