ఏపీ పంచాయతీ పోరులో ఏకగ్రీవాలకు లైన్ క్లియర్.. సర్పంచ్‌లకు డిక్లరేషన్ ఇవ్వాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు

|

Feb 09, 2021 | 7:16 AM

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది.

ఏపీ పంచాయతీ పోరులో ఏకగ్రీవాలకు లైన్ క్లియర్.. సర్పంచ్‌లకు డిక్లరేషన్ ఇవ్వాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు
SEC Nimmagadda Ramesh Kumar
Follow us on

AP Panchayat poll 2021 : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లకు డిక్లరేషన్ ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఏపీలో దుమారం రేపిన ఈ ఇష్యూ.. ఇప్పుడు సద్దుమణిగింది.

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. తొలివిడత పంచాయితీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో ఏకగ్రీవాల జాబితాను ఎన్నికల సంఘం పరిశీలించింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అసాధరణ స్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థాయిలో పంచాయితీలు ఏకగ్రీవం కావడంపై ఎన్నికల సంఘం అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దని ఇటీవల అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు.

దీనిపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘం కమిషనర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏకంగా ఎస్ఈసీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో ఎస్ఈసీ మంత్రిపై అంక్షలు విధించింది. దీంతో ఈ వ్యవహరం హైకోర్టు వరకు వెళ్లింది. మరోవైపు గవర్నర్‌ చొరవతో.. ఏకగ్రీవాలపై వెనక్కు తగ్గారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఈరోజు రేపు డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించారు.

ఇక, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను పరిశీలిస్తే.., ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమైననట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పూతలట్టు నియోజకవర్గంలో 49 గ్రామ పంచాయతీలు, గంగాధర నెల్లూరులో 26, నగరిలో 21, చిత్తూరులో 5, చంద్రగిరిలో 4, సత్యవేడులో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లా విషయానికి వస్తే రేపల్లె నియోజకవర్గంలో 17 గ్రామాలు, బాపట్లలో 15, వేమూరులో 12, పొన్నూరులో 10, తెనాలి 7, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

Read Also… AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ‘తొలి’ పోరు.. భారీ భద్రతతో ప్రారంభమైన పోలింగ్..