AP Panchayat Elections 2021: ఆ పంచాయతీకి ఎన్నికలంటే తెలీదు.. 60 ఏళ్లుగా పోలింగ్‌ ఎరుగని పల్లె అది.. తొలిసారి ఓటు వేయనున్న ప్రజలు

|

Feb 08, 2021 | 11:11 PM

చిత్తూరు జిల్లాలో ఆ పంచాయతీకి ఎన్నికలంటే తెలీదు. 60 ఏళ్లుగా పోలింగ్‌ ఎరుగని పల్లె అది..  పార్టీలతో సంబంధం లేకుండా.. పెద్దల పంచాయితీ సర్పంచ్ పీఠాన్ని నిర్ణయిస్తూ వచ్చింది. ఆరు దశాబ్దాలుగా ఏక్రగీవం

AP Panchayat Elections 2021: ఆ పంచాయతీకి ఎన్నికలంటే తెలీదు.. 60 ఏళ్లుగా పోలింగ్‌ ఎరుగని పల్లె అది.. తొలిసారి ఓటు వేయనున్న ప్రజలు
Follow us on

Polling in Vedurukuppam : చిత్తూరు జిల్లాలో ఆ పంచాయతీకి ఎన్నికలంటే తెలీదు. 60 ఏళ్లుగా పోలింగ్‌ ఎరుగని పల్లె అది..  పార్టీలతో సంబంధం లేకుండా.. పెద్దల పంచాయితీ సర్పంచ్ పీఠాన్ని నిర్ణయిస్తూ వచ్చింది. ఆరు దశాబ్దాలుగా ఏక్రగీవం అవుతూ వస్తున్న పంచాయతీ తొలిసారి పోటీకి సిద్ధమైంది. ఆరుగురు మహిళలను బరిలో నిలిపింది.

ఈసారి కూడా గ్రామంలోని ధర్మరాజుల గుడిలో గ్రామపెద్దలు సమావేశం నిర్వహించారు. కానీ ఐక్యత కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెదురుకుప్పం పంచాయతీ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు మహిళలు బరిలో దిగారు. దీంతో గత 60 ఏళ్లలో తొలిసారిగా వెదురుకుప్పంవాసులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు.

వెదురుకుప్పంలో దాదాపు 1900 మంది ఓటర్లు ఉన్నారు. ఏకగ్రీవం సాధ్యం కాకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పోలింగ్‌కు సిద్ధమవుతున్నామంటున్నారు. ఇంతవరకూ సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటు వేయడం వెదురుకుప్పం గ్రామస్థులకు తెలీదు.

పోటీ తప్పదని తేలడంతో వెదురుకుప్పంలో ఎన్నికల సందడి మొదలైంది. ఏకగ్రీవ ఆనవాయితీకి బ్రేక్‌ పడింది. మరి వెదురుకుప్పం పంచాయితీ సర్పంచ్‌గా ప్రజలు ఎవరిని గెలిపిస్తారో త్వరలోనే తేలిపోతుంది.

ఇవి కూడా చదవండి :

AP Panchayat Elections Result : పల్లెల్లో పోలింగ్‌.. ఇంతకీ ఏ జిల్లాల్లో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు.. ఓ సారి చూద్దాం..
AP Panchayat Elections 2021: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల గుర్తులు ఇవే..!