కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారికి బిగ్‌ అలర్ట్.. అప్లై చేసుకునేందుకు ఈ రోజే లాస్ట్‌ డేట్..

AP New Pension Application Deadline Ends Today: ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి ఇదో బిగ్‌ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా కింద కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం స్వీకరిస్తున్న దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాబట్టి వీలైనంత త్వరగా అర్హులైన ప్రతి ఒక్కరూ సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారికి బిగ్‌ అలర్ట్.. అప్లై చేసుకునేందుకు ఈ రోజే లాస్ట్‌ డేట్..
Ap New Pension Application Deadline Ends Today

Updated on: Sep 18, 2026 | 8:41 AM

రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న ఆసరా, ఇతర పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నట్టు పేర్కొంది. వివిధ రకాల పింఛన్లకు అర్హత కలిగిన లబ్ధిదారులు వెంటనే తమ స్థానిక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉన్న వారు అలా కూడా అప్లై చేయొచ్చని తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసిన తర్వాత దానికి ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్, ఒంటరి మహిళలు లేదా వితంతు మహిళలు అయితే విడాకులు, భర్త మరణ ధ్రువీకరణ పత్రం వంటి అవసరమైన సర్టిఫికెట్‌లను జత చేయాలని తెలిపారు. వాటన్నింటినీ కలిపి సచివాలయంలోని ఎంట్రీ అధికారులకు అందజేయాలని తెలిపారు. అయితే దరఖాస్తు గడువును పెంచాలని కొందరు కోరుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

స్టెప్-1: కొత్త పింఛన్లకు దరఖాస్తు చేయాలంటే అర్హులైన లబ్ధిదారులు అవసరమైన అన్ని పత్రాలు తీసుకొని దగ్గర్లోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలి.

స్టెప్-2: అక్కడ కొత్త పింఛన్ దరఖాస్తు ఫారమ్ తీసుకొని, సంబంధిత కేటగిరీని ఎంచుకుని మీకు సంబంధించిన వివరాలు పూర్తి చేయండి.

స్టెప్-3: వాటిని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీకి ఇస్తే.. వారు మీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి మీ బయోమెట్రిక్, ఈ-కేవైసీ పూర్తి చేస్తారు.

స్టెప్-4: తర్వాత మీరు దరఖాస్తు చేసినట్టు మీకు రసీదు ఇస్తారు. దీంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్-5: అధికారులు మీ దరఖాస్తును పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హత నిర్ధారణ అయితే మీకు కొత్త పింఛన్‌ను మంజూరు చేస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us