
ఏపీలో SIR గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. ఈనెల 24వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు ఈసీ ప్రకటించింది. సీఈవో అభ్యర్థనతో కొత్త షెడ్యూల్‌ను సవరించి విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ 24 వరకు గడువు పొడిగించింది. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. అలాగే జూలై 31 నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చింది. సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
ఇదిలా ఉండగా, సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇదే గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. అనంతరం జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్) ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28లోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి