AP: పోలీసులని చూడగానే కారు వదిలేసి ఎస్కేప్.. అసలు ఏంది కథ అని వాహనం చెక్ చేయగా..

| Edited By: Ravi Kiran

May 04, 2022 | 5:05 PM

మహా అయితే కొన్నాళ్లు జైలు చేస్తాం.. ఆ తర్వాత వచ్చిన డబ్బుతో రాజభోగం అన్నట్లు ఫీలవుతున్నారు డ్రగ్ పెడ్లర్స్. దొరికి జైలు కెళ్లి వచ్చినా.. మళ్లీ అదే గబ్బు పని చేస్తున్నారు.

AP: పోలీసులని చూడగానే కారు వదిలేసి ఎస్కేప్.. అసలు ఏంది కథ అని వాహనం చెక్ చేయగా..
representative image
Follow us on

మహా అయితే కొన్నాళ్లు జైలు చేస్తాం.. ఆ తర్వాత వచ్చిన డబ్బుతో రాజభోగం అన్నట్లు ఫీలవుతున్నారు డ్రగ్ పెడ్లర్స్. దొరికి జైలు కెళ్లి వచ్చినా.. మళ్లీ అదే గబ్బు పని చేస్తున్నారు. ఎంత విలువైన యువత భవిష్యత్‌ను మత్తుతో చిత్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో స్మగ్లర్స్ గంజాయి(Ganja )అక్రమ రవాణా చేసేందుకు ఎన్ని కథలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇటీవల విశాఖ ఏజెన్సీ(Vizag Agency) ప్రాంతం నుంచి నెల్లూరు(nellore) జిల్లా కందుకూరు మీదుగా ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న 105 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో ఇద్దరు నిందితులు పరారయ్యారు. తాజాగా వారిని కందుకూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

డీఎస్పీ కండె శ్రీనివాసరావు వివరాల ప్రకారం… పల్నాడు జిల్లాకు చెందిన పాములపాటి శ్రీనివాస్‌.. సెకండ్‌హ్యాండ్‌ కార్ల బిజినెస్ చేస్తుంటాడు. దానికి చాలా మాటలు చెప్పాలి. కొన్నాక కారు కండీషన్ బాగోలేకపోతే కష్టమర్ తిడతాడు. ఈ బాధలు అన్నీ ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఎత్తు వేశాడు. అందుకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా బెస్ట్ అని భావించాడు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకురావడం.. ఢిల్లీకి తరలించి అక్కడి ఏజెంట్లకు అప్పజెప్పడం వంటి పనులతో రెండు చేతులా డబ్బు సంపాదించడం మొదలెట్టాడు. ఈ క్రమంలో 2016లో రాజమండ్రి పోలీసులకు చిక్కడంతో.. మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తరువాత 2021లో మరోసారి ఢిల్లీ పోలీసులకు చిక్కి ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పాల రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి మళ్లీ గంజాయి దందా షురూ చేశారు. కాగా, గత నెల 24వ తేదీ కందుకూరు ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్న వీరిద్దరూ పోలీసులను చూసి కారు వదిలేసి ఎస్కేప్ అయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలించి చూడగా.. కారు సీటు కింద స్పెషల్‌గా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 51 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కందుకూరులోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న శ్రీనివాస్, రవితేజను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మరో 20కేజీల గంజాయిని, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను, రూ.20వేల విలువజేసే 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Telangana: ఏకాంతంగా ఉన్నప్పుడు అటాక్.. మర్మాంగాలను ఛిద్రం చేసి.. చేసింది అతడే..