AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు టీడీపీ ఖాతా తెరిచింది. జేసీ బ్రదర్స్ ఇలాక అయిన తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉండగా.. టీడీపీ అత్యధికంగా 18 వార్డుల్లో గెలుపొంది మున్సిపాలిటీపై పచ్చ జెండాను ఎగురవేసింది. ఇదే సమయంలో వైసీపీ 16 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు.
ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు మచ్చుకైనా కనబడలేదు. ఇదే సమయంలో కడప జిల్లా మైదుకూరులోనూ టీడీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 24 వార్డుల్లో టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 గెలుచుకున్నాయి. కాగా, తాడిపత్రి, మైదుకూరులో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ప్రధాన పార్టీలు అప్పుడే క్యాంప్ రాజకీయాలను మొదలు పెట్టాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించారు.
Also read:
AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా
భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..