
బ్యాలెట్ పేపర్‌లో పొరపాటుపై అధికారులకు ఫిర్యాదు55వ డివిజన్‌లో పోలింగ్ నిలిపివేసిన అధికారులుప్రింట్ అవుతున్న కొత్త బ్యాలెట్ పత్రాలు
కాసేపట్లో తిరిగి ప్రారంభంకానున్న పోలింగ్
నగదు, చీరలు పంపిణీ చేస్తున్న ఓ పార్టీ అభ్యర్థులు
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మరో పార్టీ
ఓటర్ చీటీ ఉన్న అభ్యర్థులకు ఏకంగా కేజీ చికెన్ ఇస్తున్న మరో అభ్యర్థి
పిఠాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు
పిఠాపురం నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
ప్రకాశం జిల్లా అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరిక
నరసాపురంలో విద్యుత్ సరఫరాలో అంతరాయంకొవ్వొత్తుల వెలుగులో కొనసాగుతున్న పోలింగ్
36 వార్డుల్లో 71 పోలింగ్ బూత్‌లలో పోలింగ్
ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డ ఐదుగురుఅద్దంకి 10వ వార్డులో నగదు పంపిణీ
నిందితుల నుంచి రూ.50 వేల నగదు స్వాధీనం
సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో ఎన్నికలు118 కార్పొరేటర్లు, 756 కౌన్సిలర్లు ఏకగ్రీవ ఎన్నిక92 చోట్ల పోలింగ్, 11,705 పోలింగ్ కేంద్రాలుమొత్తం 99,36,014 మంది ఓటర్లుమున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది పోలీసులతో భద్రత4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరింపుడ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పోలీస్ నిఘాఎన్నికల పర్యవేక్షణకు 1,543 రూట్ మొబైల్ బృందాలు111 స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 4,655 మంది పోలీసులుఈ నెల 2న అవసరమైన చోట్ల రీపోలింగ్ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఏపీలో మున్నిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దం అయింది. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే 118 కార్పొరేటర్లు, 756 కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఈ రోజులు 92 చోట్ల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం మొత్తం 11 వేల 705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ ఎన్నికల్లో మొత్తం 99 లక్షల 36 వేల 14 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు.
ఇక ఎన్నికల విధుల్లో భాగంగా 36 వేల 351 మంది పోలీసు భద్రత చర్యల్లో పాల్గొననున్నారు. 4 వేల 372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరించారు. ఈ కేంద్రాలపై డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. ఎన్నికల పర్యవేక్షణ కోసం మొత్తం 1,543 రూట్ మొబైల్ బృందాలు రంగంలోకి దించారు అధికారులు. అలాగే పోలింగ్ ముగిసన తర్వాత ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 111 స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 4 వేల 655 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈనెల 2న అవసరమైన చోట రీపోలింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈనెల 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.