AP Municipal Corporation Elections 2021: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ దూసుకుపోయింది. ఎక్కడ చూసినా వైసీపీదే హవా కొనసాగింది. ఇప్పటికే దాదాపు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతుండగా, చివరి దశకు వచ్చేశాయి. ఇక విశాఖ కార్పొరేషన్‌లో మాత్రం 30 డివిజన్లలో టీడీపీ గెలుపొంది ఆ పార్టీకి కొంత ఊరట కల్పించిందనే చెప్పాలి.
► గ్రేటర్ విశాఖలో మొత్తం 98 డివిజన్లు ఉండగా, వైసీపీ 58, టీడీపీ 30 గెలుపొందాయి. అలాగే జనసేన 4, బీజేపీ 1, సీపీఐ 1, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.
► విజయనగరం కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 42 చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ, స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
► మచిలీపట్నం – ఈ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, అందులో వైసీపీ 43, టీడీపీ 5, జనసేన 1 చొప్పున గెలుపొందారు. అయితే మరో చోటు ఓట్లలెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
► గుంటూరు – ఈ కార్పొరేషన్‌లో మొత్తం 57 డివిజన్లు ఉండగా, ఎన్నికలకు ముందే ఒక స్థానం ఏకగ్రీవమైంది అయితే మిగతా 56 స్థానాలలో వైసీపీ 43, టీడీపీ 9, జనసేన 2, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. కాగా, ఏకగ్రీవమైన అభ్యర్థి వైసీపీకి చెందినది కావడంతో గుంటూరు కార్పొరేషన్‌లో ఆ పార్టీ 44 స్థానాలు కైవసం చేసుకుంది.
► అనంతపురం – ఈ కార్పొరేషన్లలో 50 డివిజన్లు ఉండగా, 48 వైసీపీ, 2 టీడీపీ కైవసం చేసుకున్నాయి.
► ఒంగోలు – ఇక్కడ మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1, ఇతరులు 2 చోట్ల కైవసం చేసుకున్నాయి.
► చిత్తూరు – ఈ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, అందులో వైసీపీ 46, టీడీపీ 3, ఇతరులు 1 గెలుపొందాయి.
► తిరుపతి- ఈ కార్పొరేషన్‌లో మొత్తం 49 డివిజన్లు ఉండగా, వైసీపీ 48, టీడీపీ 1 చొప్పున గెలుపొందాయి.
► కర్నూలు – ఇక్కడ 52 డివిజన్లు ఉండగా, వైసీపీ 41, టీడీపీ 8, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
► కడప- ఇక్కడ మొత్తం 50 డివిజన్లు ఉండగా వైసీపీ 48, టీడీపీ 1, ఇతరులు 1 విజయం సాధించారు.
AP Municipal Election Results 2021: వైసీపీ ప్రభంజనంలో గ్లాస్ గల్లంతు.. కమలం కకావికలం