AP MPTC ZPTC Election Results: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా మారిపోయాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ హవా కొనసాగుతోంది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ ముందంజలో దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం ఆదినుంచే పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు పూర్తిగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జరుగుతున్న ఓట్ల లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగెశ్వరపురం 2 ఎంపీటీసీ వైసీపీ అభ్యర్ది కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. వేగేశ్వరపురం రెండో ఎంపీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు ఎన్నికల అనంతరం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో ఆ స్థానానికి మళ్లీ పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి.
అయితే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంతో పాటు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లిలోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా.. మొత్తం వైఎస్సార్ సీపీ పార్టీదే హవా కొనసాగుతోంది.
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి