MLC Elections Results 2023 Highlights: ఏపీలో కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. ముందంజలో వైసీపీ అభ్యర్థులు..

| Edited By: Ravi Kiran

Mar 16, 2023 | 5:37 PM

TS - AP MLC Election 2023 Results Highlights: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. స్థానిక సంస్థల ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంట లోగా రావచ్చు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు అర్ధరాత్రి వరకూ రావచ్చు.. గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ఎల్లుండి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది.

MLC Elections Results 2023 Highlights: ఏపీలో కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. ముందంజలో వైసీపీ అభ్యర్థులు..
MLC Elections Counting

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Mar 2023 05:27 PM (IST)

    మహబూబ్‌నగర్‌: 921 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి AVN రెడ్డి..

    మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ముందంజలో దూసుకెళ్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి 7,505 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మాణిక్ రెడ్డి 4569 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

    PRTU అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై AVN రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 16 Mar 2023 04:52 PM (IST)

    తూర్పు రాయలసీమలో వైసీపీ అభ్యర్థి ముందంజ..

    తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో వైసీపీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

    మొదటి రౌండ్ 7 వేల ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థికి 3079 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించగా.. పీడీఎఫ్ అభ్యర్థి బాబు రెడ్డికి 2522 ఓట్లు వచ్చాయి.

    టీడీపీ మద్దతు పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఎల్సీ రమణా రెడ్డికి 847 ఓట్లు వచ్చాయి.

    వైసిపి బలపరిచిన అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 552 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 16 Mar 2023 04:32 PM (IST)

    1213 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి..

    పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్లో మొదటి రౌండు ఫలితాలు వెల్లడయ్యాయి.

    1213 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఎం వి రామచంద్రారెడ్డి ఉన్నారు.

    మొదటి రౌండ్లో రామచంద్ర రెడ్డికి 4756 ఓట్లు వచ్చాయి.

    స్వతంత్ర అభ్యర్థి వంటేరు శ్రీనివాస్ రెడ్డికి 3543 ఓట్లు వచ్చాయి.

    పిడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 2500తో మూడో స్థానంలో ఉన్నారు.

    MLC Elections

  • 16 Mar 2023 04:28 PM (IST)

    పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానం: వైసీపీ అభ్యర్థి ముందంజ..

    పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎం వీ రామచంద్రారెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.

    మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి 12వందల పదమూడు వందల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి ఎం వీ రామచంద్రారెడ్డి (4,756ఓట్లు) ఉన్నారు.

    రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి (3,543ఓట్లు), మూడో స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి కొనసాగుతున్నారు.

    అనంతపురం జేఎన్టీయూలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండవ రౌండ్ ప్రక్రియ కొనసాగుతోంది.

  • 16 Mar 2023 04:16 PM (IST)

    భారీగా చెల్లని ఓట్లు..

    మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దాదాపు 2 వేల వరకు చెల్లని ఓట్లు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

  • 16 Mar 2023 04:12 PM (IST)

    తెలంగాణ: AVN రెడ్డికి మెజార్టీ

    మొదటి ప్రాధాన్యతలో బీజేపీ మద్దతునిచ్చిన AVN రెడ్డికి మెజార్టీ వచ్చింది. దాదాపు 1500 పైగా ఓట్లు వచ్చాయి. అయితే, మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలలేదు. అధికారికంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రకటన తర్వాత.. రెండో ప్రియరిటీ లెక్కింపు ప్రారంభం కానుంది.

  • 16 Mar 2023 03:45 PM (IST)

    శ్రీకాకుళంలో వైసీపీ విజయం

    సీఎం జగన్‌ సంక్షేమ పాలన వల్లే తనకీ విజయం దక్కిందన్నారు నర్తు రామారావు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 752 ఓట్లు పోల్‌ కాగా… మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఆయనకు 632 ఓట్లు వచ్చాయి.

    • శ్రీకాకుళం (వైసీపీ విజయం)
    • మొత్తం ఓట్లు – 776 (పోలైనవి 752)
    • నర్తు రామారావు (వైసీపీ) – 632
    • అన్నెపు రామకృష్ణ (ఇండిపెండెంట్‌) – 108
    • చెల్లని ఓట్లు – 12
  • 16 Mar 2023 03:44 PM (IST)

    కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఘన విజయం..

    కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ మధుసూదన్ సూపర్‌ విక్టరీ కొట్టారు. మొత్తం 978 ఓట్లు పోలైతే ఏకంగా 968 ఓట్లు సాధించి ఘనవిజయం సాధించారు.

    • మొత్తం ఓట్లు – 1178 (పోలైనవి 978)
    •  డాక్టర్ మధుసూదన్(వైసీపీ) – 968
    • వేణుగోపాల్‌ – 10
  • 16 Mar 2023 03:14 PM (IST)

    పశ్చిమగోదావరి-2 (వైసీపీ విజయం)

    పశ్చిమగోదావరి-2 (వైసీపీ విజయం)

    • మొత్తం ఓట్లు – 1105 (పోలైనవి 891)
    • వంకా రవీంద్ర(వైసీపీ) – 460
    • ఇండిపెండెంట్‌ – 122
  • 16 Mar 2023 02:45 PM (IST)

    కొనసాగుతున్న కౌంటింగ్

    అనంతపురం, కర్నూలు, కడప టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలోని జెఎన్టీయూ ఇంజనీరింగ్కాలేజ్‌లో కొనసాగుతోంది.

    ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థి రామచంద్రా రెడ్డిల మధ్య పోటీ ఉన్నట్లు అప్‌ డేట్ అందుతోంది. పీడీఎఫ్ అభ్యర్ధి కత్తి నర్సింహారెడ్డి ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతున్నారు.

  • 16 Mar 2023 02:26 PM (IST)

    ముందంజలో బీజేపీ మద్దతు అభ్యర్థి..

    టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి మద్దతు అభ్యర్థి AVN రెడ్డి ముందంజలో ఉన్నారు. పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి పై 742 ఓట్ల ఆధిక్యంలో AVN రెడ్డి ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో పూర్తయిన సగం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో 12,600 ఓట్లు లెక్కించాల్సి ఉంది.

     

  • 16 Mar 2023 01:24 PM (IST)

    సాయంత్రానికి ఫలితాలు..

    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికి వచ్చే వీలుంది. ఇవాళ రాత్రికి టీచర్ల నియోజకవర్గ ఫలితాలు వెలువడే వీలుంది. ఇక పట్టభద్రుల నియోజకవర్గాల ఫలితాలకు ప్రకటనకు 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది.

  • 16 Mar 2023 12:25 PM (IST)

    ఓట్ల లెక్కింపుపై హైకోర్టు..

    ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఫలితాలు మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

  • 16 Mar 2023 12:22 PM (IST)

    MLC ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌

    ఏపీ స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది. శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగతా చోట్ల ఫలితాల లెక్కింపు జరుగుతోంది.

  • 16 Mar 2023 11:11 AM (IST)

    అనంతపురం కౌంటింగ్ సెంటర్‌లో గందరగోళం..

    అనంతపురం కౌంటింగ్ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమ్మరీ షీట్లో ఉన్న సంఖ్యతో సరిపోని ఓట్లు సంఖ్య. షీట్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఓట్లు నమోదయ్యాయని.. అభ్యంతరం వ్యక్తం చేసిన పీడీఎఫ్ అభ్యర్ధి పోతుల నాగరాజు. 18 వ బూతులో 4 ఓట్లు ఎక్కవగా వచ్చినట్లు నిర్ధారణ. మూడు బూతుల్లో తక్కువగా వచ్చిన ఓట్లు. కడప జిల్లా నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లో అవకతవకలు ఎక్కువగా ఉన్నట్లు నాగరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • 16 Mar 2023 09:44 AM (IST)

    కర్నూలులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం..

    కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. 988 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని దక్కించుకున్నారు. అనుకున్న ఓట్లు కంటే వైసీపీకి అదనంగా 50 ఓట్లు వచ్చాయి. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలవగా.. 1083 ఓట్లు మాత్రమే చెల్లినవిగా పరిగణించారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 542 ఎవరికి వస్తాయో వారిని విజేతగా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.. అయితే, వైసిపి అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌ పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో విజేతగా ప్రకటించారు ఎన్నికల అధికారులు.

    Dr. Madhusudhan

     

  • 16 Mar 2023 09:33 AM (IST)

    కర్నూలులో ముగిసిన ఓట్ల లెక్కింపు.. కాసేట్లో ఫలితం..

    కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 53 ఓట్లు చెల్లనివి పక్కన పెట్టగా.. 1083 ఓట్లు మాత్రమే చెల్లినవిగా పరిగణించారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 542 ఎవరికి వస్తాయో వారిని విజేతగా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.. అయితే, వైసిపి అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌కి ఇప్పటికే పూర్తిస్థాయి మెజారిటీ వచ్చింది. మరి కాసేపట్లో తుది ఫలితాన్ని ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.

  • 16 Mar 2023 09:24 AM (IST)

    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం

    వైసీపీ ఖాతాలో మరో విజయం చేరింది. పశ్చమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్‌ గెలిచారు. మొత్తం 418 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్ధి వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి 122 ఓట్లు రాగా.. మోత్తం పోలైన ఓట్లు 1088 ఓట్లలో 25 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

     

  • 16 Mar 2023 09:14 AM (IST)

    శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి విజయం..

    శ్రీకాకుళంలో ఓట్ల లెక్కింపు ముగిసింది. స్థానిక సంస్థల MLC కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం ఓట్లలో వైసీపీ అభ్యర్థికి 632 ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు రాగా.. చెల్లని ఓట్లు 12 వచ్చాయి.

  • 16 Mar 2023 09:11 AM (IST)

    కర్నూలులో కొలిక్కి వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితం

    కర్నూలులో ఓట్ల లెక్కింపు ఓ కొలిక్కి వస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితం రానుంది. ఇప్పటికే 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్న వైసీపీ.. వైసీపీ తరఫున పోటీలో ఉన్న డాక్టర్ మధుసూదన్. మొత్తం ఓట్లు 1178, పోలైనవి 1136.. మరోగంటలో గెలుపుపై పూర్తి క్లారిటీ రానుంది.

  • 16 Mar 2023 08:44 AM (IST)

    లెక్కింపు విషయంలో ఈ అధికారులు జాగ్రత్తలు

    మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • 16 Mar 2023 08:35 AM (IST)

    కౌంటింగ్‌కు ముందు ఆ ఓట్లను పక్కన పెడుతారు..

    ఏపీలో 9 ఎమ్మెల్సీ కౌంటింగ్‌ మొదలైంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కనపెట్టనున్నారు సిబ్బంది. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెడుతారు. కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది పోటీ చేస్తున్నారు. విశాఖ గ్రాడ్యుయేట్‌ స్థానంలో 37 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీ పడుతున్నారు. కడప, అనంతపురం, కర్నూలు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది పోటీలో ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది నువ్వా నేనా అనే తరహాలో పోటీ పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానిక సంస్థల స్థానాలకు బరిలో ఆరుగురు.. పూర్తిస్థాయి ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం వెలువడే చాన్స్‌ ఉంది.

  • 16 Mar 2023 08:32 AM (IST)

    తెలంగాణలోనూ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల లెక్కింపు

    తెలంగాణలోనూ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల లెక్కింపు జరుగుతోంది. ఇందులో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ సీటు కోసం పోలింగ్ జరిగింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభమైంది. పోటీలో చెన్నకేశవరెడ్డి, జనార్థన్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, హర్షవర్థన్, మాణిక్‌ రెడ్డి ఉన్నారు.

  • 16 Mar 2023 08:31 AM (IST)

    మూడు భాగాలుగా చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన..

    రెండు స్థానాలు ఉన్నచోట అంటే పశ్చిమగోదావరిలో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను మూడు భాగాలుగా చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన విలువను ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఇలా మొదటి ప్రాధాన్యత ఓటును నిర్దేశిత కోటా చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. ఒకవేళ నిర్దేశిత కోటా గనుక చేరుకుంటే ఆ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు.

  • 16 Mar 2023 07:40 AM (IST)

    ఒక్కో ఓటు విలువ ఎలా మారుతుందంటే..

    సాధారణంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఒక ఓటర్ వేసే ఓటు విలువ ఒకటిగా ఉంటుంది.అదే ఒకే చోట రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరిగితే ఒక్కో ఓటు విలువ 100గా పరిగణిస్తారు.పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో అక్కడ ఒక్కో ఓటు విలువ 100గా లెక్కకడతారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఒక స్థానమైతే మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను సగం చేసి దానికి ఒకటి కలిపి వచ్చిన విలువను బట్టి గెలుపు నిర్ణయిస్తారు..

  • 16 Mar 2023 07:37 AM (IST)

    ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన..

    బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కన పెట్టేస్తారు. బ్యాలెట్‌ పేపర్‌లో 1,2 3 అంకెలకు బదులు ABC లేదా ఇతర అక్షరాలు ఉన్న బ్యాలెట్‌ పేపర్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లను లెక్కలోకి తీసుకొని ఒక కోడ్‌ ప్రకారం లెక్కింపు చేపడతారు.

  • 16 Mar 2023 07:34 AM (IST)

    ఎక్కడ ఎంత మంది అంటే..

    విశాఖ గ్రాడుయేట్‌ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు.

  • 16 Mar 2023 07:32 AM (IST)

    గెలుపు తమదంటే తమదే..

    ఈ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపు తమదంటే తమదని రాజకీయ పార్టీలన్నీ బలంగా చెప్తున్నాయి. అన్ని స్థానాలు తమవేనని అధికార YCP ప్రకటించింది. మరో వైపు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ అభ్యర్థులకు ఓటు వేయమని జనసేన చెప్పకపోవడం ఈ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

  • 16 Mar 2023 07:16 AM (IST)

    కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

    ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమగోదావరి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది.

Follow us on