Andhra Pradesh: ఏపీలోని వాలంటీర్లకు గుడ్ న్యూస్.. జీతం పెంపుపై కీలక ప్రకటన

|

Jan 05, 2023 | 9:07 AM

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త చెప్పారు మంత్రి పినిపే విశ్వరూప్. శాలరీ పెంపుపై కూడా క్లారిటీ ఇచ్చారు.

Andhra Pradesh: ఏపీలోని వాలంటీర్లకు గుడ్ న్యూస్.. జీతం పెంపుపై కీలక ప్రకటన
Andhra Pradesh Grama Volunteers
Follow us on

ఆంధ్రాలోని వాలంటీర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. జీతం పెంపుపై కీలక ప్రకటన చేశారు  మంత్రి పినిపే విశ్వరూప్.  రాబోయే ఎలక్షన్స్‌లో వైసీపీ అధికారంలోకి రాగానే.. గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు వివరించారు.  కోనసీమ జిల్లా అల్లవరంలో..  గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. కష్టపడి పని చేసి.. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి.. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వేరే పార్టీ రూలింగ్‌లోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసివేస్తుందని చెప్పుకొచ్చారు.

అర్హత ఉండి.. సంక్షేమ ఫలాలు పొందని వారు ఎవరైనా ఉంటే.. వారిని 6 నెలలకు ఒకసారి క్రాస్ వెరిఫై చేసి గుర్తించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించేలా జగన్ సర్కార్ చిత్తశుద్ధి చాటుతోందన్నారు మినిస్టర్ విశ్వరూప్. నియోజకవర్గ పరిధిలో 1200 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. చెప్పినట్లుగా పెరిగిన పించన్ సొమ్మును జనవరి 2023 నుంచి ఇస్తున్నామన్నారు. పెన్షన్లు తీసివేయడమనేది తప్పుడు ప్రచారమని.. ఎవరూ నమ్మొద్దన్నారు.  2019లో 39 లక్షలు ఉన్న పెన్షన్ల సంఖ్యను ప్రజంట్ 64 లక్షలకు పెంచారన్నారు మంత్రి.

సీఎం జగన్ త్వరలో వాలంటీర్లపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్రే కీలకం. వాలంటీర్ల వ్యవస్థ క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే విషయంపై త్వరలో రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆపై జిల్లాలవారీగా వాలంటీర్లతో నేరుగా ముఖ్యమంత్రే మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం