
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 4న నేతల భవితవ్యం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము క్లారిటీగా ఉన్నామని, తమకు 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారు.. ఫలితం బాక్స్‌లో ఉంది. ఏదీఏమైనా మరోసారి అధికారంలోకి రానున్నామని అన్నారు. విద్య, వైద్యంలో సంస్కరణలు మా మేనిఫెస్టోలో పెట్టామని, విద్యా విధానంలో లోపాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో కొత్త సంస్కరణలు ఉన్నత విద్యలో ప్రవేశ పెడుతున్నాం.. విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.
స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లి ఒక్కసారి చూస్తే తెలుస్తుంది.. బైజుస్.. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇలా ఎన్నో మార్పులు వచ్చాయని, దేశంలో ఎక్కడా లేని మార్పులు ఏపీ విద్యా విధానంలో జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని అన్నారు. ప్రస్తుతానికి ఐ-ప్యాక్ నిర్మాణత్మకంగానే ఉందని అనుకుంటున్నాం.. ప్రశాంత్ కిషోరైనా ఐ-ప్యాక్ అయినా తాత్కాలికం.. వైసీపీ శాశ్వతం. కో-ఆర్డినేషన్ కోసం ఐ-ప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నాం. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయి.. నిర్ణయం తీసుకోవాల్సింది మేమే. ఐ-ప్యాక్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవమని వెల్లడించారు.
ఐ-ప్యాక్ ఓ జాబితా ఇస్తుంది.. అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుంది. మేం వెరీ క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి.. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. జగన్ అడిగిన విధంగా మోడీ కూడా ధైర్యంగా ఓట్లడగలేకపోతున్నారు. నా పరిపాలన చూసి ఓటేయండని ప్రధాని కూడా అడగలేకపోయారు. దేశానికి మేలు చేశానని.. ఓటేయ్యండి అని మోడీ కూడా అడగడం లేదు. రామాలయ నిర్మాణం, సీతమ్మ భూమి, ముస్లిం రిజర్వేషన్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికలయ్యాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరి ధీమా వారికుంది. మేం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పాం. ప్రతిపక్షంలో కూడా వారు చెప్పాల్సింది చెబుతున్నారు. ఎన్నో ఎన్నికలు చూశాను కానీ.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడడం లేదని బోత్స అన్నారు. ఇప్పుడు ప్రధాన రాజకీయ నేతలంతా విదేశాల్లో ఉన్నారు. జగన్ విదేశీ పర్యటన మీద రకరకాల విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు.. లోకేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ముఖ్య నేతలు విదేశాల్లో ఉన్నారు. ఇంకొందరు నేతలు ప్రయాణాల్లో ఉన్నారు. ఇక్కడున్న వారు ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించారు.
అయితే చంద్రబాబు ఎక్కడికెళ్లారో ఎందుకు చెప్పడం లేదని బోత్స ప్రశ్నించారు. చెప్పాల్సిన అవసరం లేదంటే ఓకే.. అటువంటప్పుడు జగన్ పర్యటనల మీద ఎందుకింత చర్చ.. అని మండిపడ్డారు. జగన్ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఓ చదువుకున్న శుంఠ గొడవ చేశాడు. విద్యా వైద్యంలో మాపై ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. కూటమి మేనిఫెస్టోలో విద్యా రంగంపై హామీలు ఎందుకివ్వలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానం మెరుగయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి