Minister Balineni: వైసీపీ సర్కార్ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు.. ప్రతి సమస్య చర్చల ద్వారానే పరిష్కారంః మంత్రి బాలినేని

|

Feb 03, 2022 | 2:17 PM

ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని, చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.

Minister Balineni: వైసీపీ సర్కార్ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు.. ప్రతి సమస్య చర్చల ద్వారానే పరిష్కారంః మంత్రి బాలినేని
Balineni Srinivasulu Reddy
Follow us on

Minister Balineni on on AP Govt Employees: ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సానుకూలంగా ఉన్నారని, చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి(Balineni Srinivasulu Reddy) అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదన్నారు.. జగన్ సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఇది చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తుచేసుకోవాలన్నారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడిన విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు.

మరోవైపు విద్యుత్ ఉద్యోగుల విషయంలో సీఎం తో మాట్లాడిన తర్వాత ఒకేసారి నాలుగు డిఏ లు ఇచ్చామన్నారు. విద్యుత్ శాఖలో పీఆర్సీపై మార్చిలో వేయాల్సిన కమిటీని ఇప్పుడే వేశామన్నారు. అలాగే, మిగిలిన ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని తెలిపారు…

మరోవైపు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన స్పందించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలని కోరుతున్నారని, కేవలం పార్లమెంట్ సెగ్మెంట్ ఆధారంగానే జిల్లాల పునర్విభజన చేపట్టారని మంత్రి స్పష్టం చేశారు. ప్రాంతాలవారీగా పునర్విభజన చేపట్టే అవకాశం ఉంటే రాష్ట్రంలో మొట్టమొదటిగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కందుకూరు లో రెవెన్యూ డివిజన్ కొనసాగించే విషయంలో సీఎంతో మాట్లాడామని, ఏం చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లాకు సంబంధిచిన సమస్యలు, అభివృద్ది కార్యక్రమాలపై రేపు ముఖ్యమంత్రితో భేటి కానున్నామని, ఈ సమావేశంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

Read Also… Bandi Sanjay Arrest Issue: ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన తెలంగాణ పోలీసు అధికారులు.. బండి సంజయ్ అరెస్టుపై వివరణ..