
నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రస్తావనే లేదు. ఇంకా ప్రిలిమినరీ స్టేజ్‌లోనే ఉంది ఏపీలో స్థానిక ఎన్నికల అంశం. కాకపోతే, ఒక్కటొక్కటిగా అడ్డంకులైతే తొలగిపోతున్నాయి. అంతలోనే, ఎన్నికలు కావాలా వద్దా అనే బేసిక్ పాయింట్ మీదే లోకల్ పాలిటిక్స్ వేడెక్కిపోతున్నాయి. ఆరునూరైనా అక్టోబర్‌లోగా ఎన్నికలు జరిపించాలి.. లేకుంటే ఢిల్లీ నుంచి వచ్చే వేలకోట్ల ఫండ్స్ నిలిచిపోతాయ్.. అని గల్లీ వార్‌కి సై అంటోంది కూటమి ప్రభుత్వం. సాంకేతిక అడ్డంకుల్ని క్రియేట్ చేసి ఎన్నికల్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందని వైసీపీ వైపు వేలెత్తి చూపుతూ, ఆవిధంగా అపోజిషన్‌పై నైతిక దాడి షురూ చేసింది. అటు, వైసీపీ కూడా ఎథికల్లీ, టెక్నికల్లీ, పొలిటికల్లీ అన్ని విధాలుగా లోకల్ హీట్‌కి ఎదురొడ్డి పోరాడాలని డిసైడైంది. అందుకోసం కావల్సిన అస్త్రాల్ని శస్త్రాల్ని తెగ వాడేస్తోంది. ఎన్నికలు మొదలుకాకముందే కాక రేపుతున్న లోకల్ పాలిటిక్స్.. అక్టోబర్ నెల వచ్చి, ఎన్నికల షెడ్యూల్ గనుక రిలీజైతే ఇంకెంత కేక పుట్టిస్తాయో కదా? వరుస అధికారిక కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌తో సతమతం ఔతున్నా తన ముందున్న అతిపెద్ద రాజకీయ బాధ్యతను కూడా మర్చిపోయే మూడ్‌లో లేరు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు. గురువారం క్యాబినెట్ సమావేశం ఐపోయ్యాక.. గంటన్నర సేపు మంత్రులతో ప్రైనేట్‌గా మాట్లాడారు సీఎం చంద్రబాబు. అన్నీ...