Housing scheme : ముప్ఫై లక్షల మంది పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించడం ఒక చరిత్ర : శ్రీరంగనాధ్ రాజు

|

Jul 22, 2021 | 10:10 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ముప్ఫై లక్షల మంది పేదలకు ఉచిత ఇల్లు కట్టించడం ఒక చరిత్ర అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధ్ రాజు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

Housing scheme :  ముప్ఫై లక్షల మంది పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించడం ఒక చరిత్ర : శ్రీరంగనాధ్ రాజు
Ap Minister Sriranganathara
Follow us on

AP Housing : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ముప్ఫై లక్షల మంది పేదలకు ఉచిత ఇల్లు కట్టించడం ఒక చరిత్ర అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధ్ రాజు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వైయస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలపై విజయవాడలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని సౌకర్యాలతో జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.

లబ్ధిదారుల గృహ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్‌ను తక్కువ ధరకు అందిస్తున్నామన్నామని మంత్రి తెలిపారు. అదనపు గదులు కట్టుకునేందుకు కూడా అనుమతులు ఇస్తున్నామన్నారు. అన్ని జిల్లాలలో పర్యటిస్తూ లబ్ధిదారులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో లోలెవల్ లేఅవుట్లు ఎంపిక చేయడం దురదృష్టకరమన్నారు. వాటిలో ఆరు అడుగుల వరకు మేరకు వేయాల్సి వస్తుందని స్థలాల కొనుగోలు కంటే ఎక్కువ ఖర్చు మేరకు వేసేందుకు అవుతుందన్నారు. ఇరవై శాతం తక్కువ ధరకు మెటల్ అందించాలని కోరారు.

Read also : Tirumala : దేవదేవుడు తిరుమల శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభవార్త చెప్పిన టిటిడి ఈవో