Andhra pradesh: ఆ బాలికకు ఉచిత వైద్యం అందించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..

|

Jan 30, 2022 | 11:12 AM

అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఓ బాలికకు ఉచిత వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High court) ఆదేశించింది. ఆ బాలిక  చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ సహా  అందుబాటులో అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించింది

Andhra pradesh: ఆ బాలికకు ఉచిత వైద్యం అందించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..
Ap High Court
Follow us on

అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఓ బాలికకు ఉచిత వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High court) ఆదేశించింది. ఆ బాలిక  చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ సహా  అందుబాటులో అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించింది.  ఈమేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందనరావు (Justice Raghunandan Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి పూర్తి సంబందించిన వివరాలిలా ఉన్నాయి.  చిత్తూరుకు చెందిన ఓ బాలిక గోషే అనే వ్యాధితో బాధపడుతోంది.  కాగా తనకు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును  అందించాలంటూ ఆ బాలిక హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈ మేరకు బాలిక తరఫున న్యాయవాది తరఫున రాజేశ్ కుమార్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ‘రాష్ట్రంలో ఇలాంటి అరుదైన వ్యాధి బాధితులు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉంటారు.  వ్యాధి కారణంగా వారి జీవితం కుచించుకుపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.  బాలికకు  ఎంజైమ్ మార్పిడి చికిత్స చేయాలి. రెండు వారాలకు ఒకసారి ఎంజైమ్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇందుకోసం సుమారు ఏడాదికి రూ. 25 లక్షల ఖర్చు అవుతుంది’ అని పిటిషనర్ తెలిపారు.

వారిని అలా వదిలేయడం సమంజసం కాదు..

కాగా ఇలాంటి వ్యక్తిగత ఖర్చులను భరించే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని   కేంద్ర సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్ జీ)  హరినాథ్ తెలిపారు. ఇలాంటి బాధితులకు వ్యక్తిగత సాయమందించే విధానమేమీ లేదని ఆయన వాదనలు వినిపించారు.  ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తరపున న్యాయవాది ఆరోగ్యశ్రీ వివరాలను వెల్లడించారు. అయితే బాలిక వ్యాధికి సంబంధించి ఈ పథకంలో ఎలాంటి బీమా వర్తించదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి పేదరికంతో అరుదైన వ్యాధిగ్రస్తులు కన్నుమూసేలా ప్రభుత్వాలు వదిలేయకూడదని, ఈ మేరకు గతంలో ఎన్నో న్యాయస్థానాలు ఈ విషయాన్ని చెప్పాయని గుర్తు చేశారు.  బాలిక బాధపడుతున్న వ్యాధికి ఆరోగ్య బీమా ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అదేవిధంగా చికిత్సకు అయ్యే ఖర్చులను సమకూర్చేందుకు క్రౌడ్ ఫండింగ్ సహా అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించారు.

Also read:

Tirupati: తిరుపతిలో దారుణం.. జనసేన కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు..

Coronavirus: దేశంలో అదుపులోకి వస్తోన్న కరోనా మహమ్మారి.. మరణాలు మాత్రం భారీగానే .. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం.. ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు.. ఎడబాటుతో ప్రేమికుల బలవన్మరణం..