AP High Court: ‘అమూల్‌’ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఎంవోయూపై ప్రభుత్వ నిధులు ఖర్చు చేయవద్దని ఆదేశం!

|

Jun 04, 2021 | 8:13 PM

అమూల్‌’ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమూల్‌తో కుదుర్చుకున్న ఎంవోయూపై నిధులు ఖర్చు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

AP High Court: ‘అమూల్‌’ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఎంవోయూపై ప్రభుత్వ నిధులు ఖర్చు చేయవద్దని ఆదేశం!
Ap High Court
Follow us on

AP High Court on Amul Case: ‘అమూల్‌’ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమూల్‌తో కుదుర్చుకున్న ఎంవోయూపై నిధులు ఖర్చు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమూల్ పాల ఉత్పత్తి సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘు రామకృష్ణ రాజు అమరావతిలోని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మసనం.. అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎలాంటి నిధులు వెచ్చించొద్దని ప్రభుత్వానికి సూచించింది.

అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ వేశారు. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. కాగా, తదుపరి విచారణ నిమిత్తం గుజరాత్‌లోని అమూల్‌తో పాటు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి కేసును వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.

కాగా, ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఎంపీ రఘు రామకృష్ణ రాజు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఏపీ ప్రజలకు న్యాయం జరుతుందని భావిస్తున్నానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Read Also… Viral Photos: నేచర్ ఫోటోగ్రఫీ అవార్డు 2021 గెలుచుకున్న అపురూప చిత్రాలు.. జంతువులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మీకోసం..