Andhra Pradesh News: మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్ట్(AP High Court) కీలక తీర్పు వెల్లడించింది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదికను హైకోర్టు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికిి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
అమరావతి(Amaravati) నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని స్పష్టం చేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలనె సూచింది. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని పేర్కొంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని ఆదేశించింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి: Blood Sugar: వేసవిలో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 5 పండ్లను తినండి..
Summer Tips: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఎందుకు మంచిది.. తెలిస్తే షాక్ అవుతారు..