AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌..రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలన్న ఏపీ హైకోర్టు

అంగళ్లు కేసులో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేశారు.

Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌..రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలన్న ఏపీ హైకోర్టు
Chandrababu
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 13, 2023 | 11:45 AM

Share

అమరావతి, అక్టోబర్ 13: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలన్న ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంగళ్లూ కేసులో గురువారం వాదనలు ముగిసాయి. ఇవాళ మొదటి కేసుగానే దీనిపై తీర్పు వెలువడింది. గతంలో చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లే సమయంలో అంగళ్లు దగ్గర ఘర్షణలో ఉద్రిక్తత తలెత్తింది. చంద్రబాబు ముందుగా చెప్పిన రూట్‌లో కాకుండా మరో దారిలో వెళ్లడమే ఈ గొడవలకు కారణమని కేసులు నమోదు చేశారు. రాళ్లదాడికి కారణాల విషయంపైనా కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది.

ఈ కేసులో A-1గా ఉన్నారు చంద్రబాబు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆరోజు ఘర్షణ జరిగిందని పోలీసులు ఆరోపించారు. ఆయనపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో దాదాపు 179 మంది వరకూ ఉన్నారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ ఇప్పటికే బెయిల్‌ దొరికింది. ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఊరట లభించింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తుతో బెయిల్‌ ఇచ్చింది కోర్టు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి