రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాధారణ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎం.ఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు.
ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి, ఎంపికైన వారికి కౌన్సెలింగ్ ద్వారా పాఠశాల కేటాయింపు చేపడతారు.
గుంటూరు జిల్లాలోని తాడికొండ, అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్ళితో సహా మిగిలిన పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి 5 వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభంకాగా, ఈనెల 30 వరకు ‘హెచ్‌టీటీపీఎస్.ఏపీఆర్‌ఎస్. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్’ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాటరీ పద్ధతి ద్వారా జూలై 14న అర్హులను ఎంపిక చేస్తారు.
ప్రవేశానికి అర్హతలు..