రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

| Edited By:

May 15, 2020 | 1:43 PM

ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. ఖరీఫ్ పంట వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో.. రైతు భరోసా పథకం కింద నిధులను నేటి నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బు జమ..

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ
Follow us on

ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. ఖరీఫ్ పంట వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో.. రైతు భరోసా పథకం కింద నిధులను నేటి నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బు జమ చేస్తున్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 49,43,590 మంది రైతులకు నిధులు పంపిణీ చేయనున్నారు. ఇందులో సాధారణ లబ్ధిదారులు 46,28,767 మంది ఉండగా, వెబ్ ల్యాండ్‌కు అనుసంధానం కాని వారు 2,12,025, చనిపోయిన వారి వారసులు 61,555, అటవీ భూములు సాగు చేసుకునే వారు 40,620 మంది, దేవాదాయ భూముల రైతులు 623 మంది ఈ జాబితాలో ఉన్నారు.

ఈ ఒక్కొక్కరి ఖాతాలో రూ.7,500 జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా రూ.2 వేలు పీఎం కిసాన్ నిధులు గత నెలలోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన డబ్బులను ఇప్పుడు వేయనున్నారు. పథకానికి ప్రభుత్వం రూ.505 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బ్యాంకులో నుంచి ఈ సొమ్మును తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తినా… రైతులు 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు.

Read More:

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?