AP Gov jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలోనే..

|

Mar 10, 2022 | 11:43 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం నేడు (మార్చి 10) అసెంబ్లీ సమావేశంలో లిఖిత పూర్వకంగా సమర్పించింది..

AP Gov jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలోనే..
Ap Jobs
Follow us on

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం నేడు (మార్చి 10) అసెంబ్లీ సమావేశంలో లిఖిత పూర్వకంగా సమర్పించింది. అన్ని జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాకు సంబంధించి 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు (Gov job vacancies) ఖాళీగా ఉన్నాట్లు తెల్పింది. మొత్తం ప్రభుత్వ 7,71,177 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా, వీరిలో శాశ్వత ఉద్యోగులు 5,29, 868 మంది. ఇక కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దాదాపు 1,75,000 మందిదాకా ఉన్నారు. మొత్తం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు 7,04,868 మంది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తెల్పింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా1,27,000 ఉద్యోగాలు భర్తీ చేయగా, వైద్యారోగ్య శాఖలో 22,306 ఉద్యోగాలు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా నియామకాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రభుత్వ వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసింది.

Also Read:

Russia Ukraine Crisis: ఆ విషయం తెలిసి చాలా సంతోషించాను.. నువ్వక్కడ జాగ్రత్త.. హీరో చిరంజీవి!