Andhra Pradesh: ఏపీ సర్కారు కొత్త ఆదేశాలు.. ఇకపై ఆ ఉద్యోగులు రోజుకు మూడుసార్లు హాజరు వేయాల్సిందే..

AP Government: ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం - ప్రజల మధ్య వారధిగా సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

Andhra Pradesh: ఏపీ సర్కారు కొత్త ఆదేశాలు.. ఇకపై ఆ ఉద్యోగులు రోజుకు మూడుసార్లు హాజరు వేయాల్సిందే..
Ap Government

Edited By: Anil kumar poka

Updated on: Apr 17, 2022 | 9:41 AM

AP Government: ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం – ప్రజల మధ్య వారధిగా సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు ఆ సచివాలయాల్లో పని చేసే ఉద్యోగుల విషయంలో కొత్త హాజరు నిబంధన తీసుకొచ్చింది. ఏ ఇతర ప్రభుత్వశాఖల్లోనూ లేని విధంగా రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరి చేసే కొత్త విధానం సచివాలయాల్లో ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ను ఉద్యోగులు తమ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని చేసుకోవాలి. రోజూ మూడు సార్లు హాజరు వేసుకోవాలి.

ప్రొబేషన్‌ ఖరారు ఎప్పుడో!

ఇందు కోసం మూడు సమయాలను నిర్దేశించింది. ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. సొంత ఫోన్లు లేనివారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్‌ ఫోన్లను ఉపయోగించుకోవాలని సూచించింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు తమ ప్రొబేషన్ ఖరారు పైన ప్రభుత్వం ఇచ్చిన హామీ పైనా ఆశగా ఎదురు చూస్తున్నారు. 2019 అక్టోబరులో విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ 2021 అక్టోబరులో ఖరారు చేయాలి. శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశంతో 2022 జూన్‌లో అందరి ప్రొబేషన్‌ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు.కాగా రోజుకు మూడుసార్లు హాజరు వేసుకోవాలన్న సర్కారు ఆదేశాలతో సచివాలయ ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: BSF Recruitment 2022: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..

Jai Shankar: ఉక్రెయిన్‌పై భారత తటస్థ వైఖరి సరియైనదేనంటూ ప్రపంచ దేశాలను ఒప్పించిన దిట్ట జైశంకర్..

Rahul Gandhi Tour: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరు!