Corona Effect: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు.. బేఖాతర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

|

Apr 25, 2021 | 5:42 PM

Andhrapradesh Government: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం...

Corona Effect: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు.. బేఖాతర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Ap Government
Follow us on

Andhrapradesh Government: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దాదాపు పది వేల వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనా అలుసుగా చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు ధరలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

సిటీ స్కాన్‌, పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్‌-19 డాష్‌ బోర్డులో పాజిటివ్‌ వచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, కరోనా పేషెంట్ల చికిత్సలపై వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.01 లక్షల మంది కోవిడ్‌ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందు కోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈనెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు.

Covid Review: తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ విజ‌ృంభణ.. నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సర్కార్లు సీరియస్

పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం