సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సమాచార మార్పిడిలో వేగం పెరిగింది. దీంతో ప్రజలు సమాచారాన్ని త్వరగా తెలుసుకునే అవకాశం కలిగింది. అయితే ఈ సమాచారమంతా నిజంగా నిజమేనా అంటే కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకుంటే కొన్ని సందర్భాల్లో తప్పుడు వార్తలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంస్థలు లేదా వ్యక్తుల ప్రతిష్టతను దెబ్బతీయాలనే లక్ష్యంతో కొందరు ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. దీంతో ఫేక్ న్యూస్‌ను తిప్పి కొడుతూ ప్రభుత్వాలు, సంస్థలు ఫ్యాక్ట్ చెక్ పేరుతో నిజమేంటో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఇదే పనిని చేపట్టింది. ‘ఫ్యాక్ట్ చెక్ ఏపీ.జీఓవీ.ఇన్’ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై వస్తోన్న తప్పుడు ఆరోపణలను నివృత్తి చేస్తోంది.
ఇందులో భాగంగా తాజాగా ఓ విషయమై అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా తిరుపతి పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న గోడలపై పెయింటింగ్ పనులను మొదలు పెట్టారు. అంతకు ముందు ఉన్న పెయింటింగ్‌లను తొలగించి మళ్లీ కొత్తగా వేయడానికి అధికారులు పనులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే అప్పటికే ఉన్న బొమ్మలపై కొత్తగా రంగులను వేశారు. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి నెట్టింట వైరల్ చేశారు. వైసీపీ జెండా రంగులు వేస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
The phase-wise ongoing beautification work is being carried out by different vendors in parts of the city.
The concerned leaders are requested to pay a visit to appreciate the artwork after the work is concluded.
~ @MCTTirupati pic.twitter.com/wib7IWi709
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) September 28, 2022
దీంతో ఈ విషయమై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వైరల్ అవుతోన్న ఫొటోల్లో నిజం లేదని. గోడలపై స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన బొమ్మలను పెయింటింగ్ వేస్తున్నట్లు తెలిపే ఫొటోలు, వీడియోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..