AP Assembly 2024: ఏపీలో అప్పటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్‎గా ఛాన్స్ వారికే అట.!

|

Jun 16, 2024 | 7:31 AM

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 19 నుంచి రెండు రోజులపాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‎లో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అభివృద్దిని పరుగులు పెట్టిస్తానంటూ కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు.

AP Assembly 2024: ఏపీలో అప్పటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్‎గా ఛాన్స్ వారికే అట.!
Ap Assembly
Follow us on

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 19 నుంచి రెండు రోజులపాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‎లో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అభివృద్దిని పరుగులు పెట్టిస్తానంటూ కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం హాట్ టాపిక్‎గా మారింది. ఒకవైపు ఏపీలో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలువురు టీడీపీ, వైసీపీ నేతల ఇంటిని ముట్టడిస్తున్నారు కార్యకర్తలు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెషన్స్ నిర్వహించనుంది ప్రభుత్వం. ముందుగా ప్రోటెం స్పీకర్.. గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.

ఆ తరువాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పుడున్న సీనియారిటీ ప్రకారం ప్రోటెం స్పీకర్‎గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే స్పీకర్‎గా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ఉత్కంఠ చాల మందిలో నెలకొంది. మన్నటి వరకు హోం శాఖ మంత్రి ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠకు తెరదించిన ప్రభుత్వం.. తాజాగా స్పీకర్ ఎంపికపై కూడా చిన్నగా లీకులు విడుదల అవుతున్నాయి. ఈ సారి సభలో స్పీకర్‎గా అయ్యన్న పాత్రుడు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్ నేత అయిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్‎కు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున అయ్యన్న పాత్రునికి స్పీకర్‎గా అవకాశం ఇస్తే.. జనసేన తరఫున మండలి బుద్ద ప్రసాద్‎కు డిప్యూటీ స్పీకర్‎గా నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్‎గా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోందంటున్నారు పార్టీ నాయకులు. అయితే వీటిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో అటు అధికార ఎన్డీయే కూటమి, ఇటు ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ మధ్య సభలో మాటల యుద్దం హోరా హోరీగా, వాడీవేడిగా నడిచే అవకాశం ఉంటుందని చర్చించుకుంటున్నారు ప్రజలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…