AP Liquor Shops Timing: ఏపీలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. మధ్యాహ్నం 12గంటల వరకే మద్యం షాపులు

ఏపీలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

AP Liquor Shops Timing: ఏపీలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్..  మధ్యాహ్నం 12గంటల వరకే మద్యం షాపులు
Ap Liquor Shops

Updated on: May 04, 2021 | 8:28 PM

AP Liquor Shops Timing: ఏపీలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మందు బాబుకుల బ్యాడ్‌ న్యూసే అని చెప్పాలి. మద్యం షాపుల సమయాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. బుధవారం నుంచి మద్యం అమ్మకాల వేళలను కుదించింది. దీంతో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఉత్తర్వులు జారీచేసింది.

కాగా, ఒక వైపు కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. సెకండ్ వేవ్ వైరస్‌ కారణంగా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 20వేలకు పైగా కొవిడ్‌ కొత్త కేసులు నమోదు కాగా.. 82మందికి పైగా మరణించారు. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో రాష్ట్ర సర్కార్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది.

Read Also… Corona: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌