AP News: ఆలయ అర్చకులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

|

Oct 10, 2024 | 8:48 PM

దేవాలయాల దగ్గర నుంచే ప్రక్షాళన మొదలుపెడతామన్న సీఎం చంద్రబాబు సర్కార్.. ఆ దిశగా అడుగులు వేసింది. ఆలయ కార్యక్రాల్లో అధికారుల పాత్రను తగ్గిస్తూ అర్చకులకు విశేష అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

AP News: ఆలయ అర్చకులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Government
Follow us on

దేవాలయాల్లో పూజాదికాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారైనా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అర్చకులకు విస్తృత అధికారాలు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.

పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేసింది. ఆయా దేవాలయాల ఆగమం ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలనేది ప్రభుత్వ జీవో సారాంశం. దేవదాయ కమిషనర్ సహా.. ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని జీవోలో వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుంభాభిషేకాలు, పూజ‌లు, ఇత‌ర సేవ‌ల్లో అధికారుల పాత్ర ప‌రిమితంగానే ఉండ‌నుంది. పండుగలు, యాగాలు వంటి ముఖ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రభుత్వ జోక్యం కూడా తగ్గనుంది.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..