Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన లబ్ధిదారులకు అలెర్ట్.. అలా చేయకుంటే డబ్బులు కట్

|

May 02, 2022 | 10:12 AM

జగనన్న విద్యాదీవెనకు కొందరు అనర్హులుగా తేలారంటూ గవర్నమెంట్ నోటీసులు జారీ చేస్తోంది. 10 రోజుల్లోగా అర్హతకు సంబంధించిన ప్రూఫ్స్ సమర్పించాలని తెలిపింది.

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన లబ్ధిదారులకు అలెర్ట్.. అలా చేయకుంటే డబ్బులు కట్
Jagananna Vidya Deevena
Follow us on

Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అలెర్ట్ వచ్చింది.  బోధనా రుసుముల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు అనర్హులుగా తేలారంటూ సర్కార్ నోటీసులు జారీ చేస్తోంది. ఇన్‌కమ్ చెల్లిస్తున్నారని, ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారని, పట్టణ ప్రాంతాల్లో పరిధికి మించి ఇంటి విస్తీర్ణం కలిగి ఉన్నారని.. తదితర కారణాలతో దరఖాస్తుదారుల పేరు మీద అధికారులు వీటిని జారీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సచివాలయాల వారీగా సంబంధిత లబ్ధిదారులకు పంపారు. విద్యార్థులు అందుబాటులో లేనిపక్షంలో వారి పేరెంట్స్‌కు నోటీసులు అందించి.. వారి సంతకం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ డాక్యుమెంట్ తిరిగి నవశకం లాగిన్‌లో అప్​లోడ్ చేయాలని సూచించారు. 10 రోజుల్లోగా అర్హతకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని,.. లేకపోతే దరఖాస్తును పర్మనెంట్‌గా రిజెక్ట్ చేస్తామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.

తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా… తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్లి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై పేరెంట్స్ పర్యవేక్షణ రెండూ జరుగుతాయని సీఎం జగన్ గతంలో పేర్కొన్నారు.

Also Read: Hero siddharth: ‘పాన్‌ ఇండియా పదమేంటి? నాన్సెన్స్‌’.. హీరో సిద్దార్థ్ సంచలన కామెంట్స్