AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనుంది. 87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తయ్యింది. అయితే నవంబర్‌లో మరో 13 పాలక వర్గాల గడువు..

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
Ap Municipal Elections

Updated on: Aug 19, 2026 | 7:26 PM

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనుంది. 87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తయ్యింది. అయితే నవంబర్‌లో మరో 13 పాలక వర్గాల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం జారీ చేసింది.

అయితే కోర్టు కేసుల కారణంగా 23 చోట్ల గతంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో అన్ని కలిపి 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, రిజర్వేషన్‌పై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పట్టణాల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహించనుంది. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బీసీ రిసర్వేషన్‌లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించనుంది. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us